కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన ఎంపీగా అనర్హుడయ్యారని ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్(Kapil Sibal) అన్నారు. అయితే ఆ శిక్ష కూడా విచిత్రమని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ దోషిగా తేలడం వల్ల ఆయన లోక్‌సభకు రాకుండా చేస్తారా అనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకవేళ కోర్టు ఆయనకు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తే సరిపోదని కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. సస్పెన్షన్ లేదా నేరారోపణపై స్టే విధించాలని అన్నారు. నేరారోపణపై స్టే ఉంటేనే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా కొనసాగగలరని సిబల్ చెప్పారు. ఏదైనా నేరంలో రెండేళ్లపాటు శిక్ష పడితే ఆ సీటు ఖాళీగా ఉంటుందని చట్టం చెబుతోందని ఆయన వివరించారు. సహజంగా స్పీకర్ చట్టానికి అనుగుణంగా నడుచుకుంటారని అన్నారు.
2013లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా ఏ ఎంపీ, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ నేరానికి పాల్పడి కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించినా తక్షణమే సభ సభ్యత్వం కోల్పోతారని అందులో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4)ని న్యాయస్థానం రద్దు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ నేరారోపణకు వ్యతిరేకంగా మూడు నెలల పాటు అప్పీలు చేసుకోవడానికి అనుమతించారు. అయితే సూరత్ కోర్టు తీర్పును సిబల్ విచిత్రంగా అభివర్ణించారు.
2019ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ 2019లో సూరత్ కోర్టులో నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. ఈకేసులో రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉండటంతో సూరత్ కోర్టు దోషిగా తేల్చింది.
Breaking News: జయమంగళం ఓటమికి కారణాలు ఇవే? ఆ ఇద్దరిపై వేటు తప్పదా..? సంబరాల్లో టీడీపీ
Breaking News: వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ గెలుపు
రాహుల్‌గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దొంగలందరికి ఇంటి పేరు మోదీ అని ఎందుకు వచ్చిందని కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ర్యాలీ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోఈ కామెంట్ చేశారు.ఆ కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi