కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఈ నెల 20న ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి పంజాబ్‌లో అధికారం నిలుపుకునేందుకు కాంగ్రెస్ ఎంతో ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్, అకాలీదళ్ సహా అన్ని పార్టీలు తమ శక్తియుక్తులతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్‌కు చేరుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో రాహుల్ ఈ సభలో వివరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతానని రాహుల్ గాంధీ అన్నారు. పేద ప్రజలకు ఉచిత కరెంటు ఇచ్చేందుకు అంగీకరించకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సాకుగా చూపి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచిత కరెంటును కెప్టెన్ అమరీందర్ సింగ్ నిరాకరించారని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి బీజేపీ నడుపుతున్నందున దానిని మార్చవలసి వచ్చిందని పేర్కొన్నారు. కొట్కాపురలో జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం అమరీందర్ పేరు చెప్పకుండా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్‌లో ఐదేళ్లు తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ ప్రభుత్వంలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమే అని రాహుల్ గాంధీ అన్నారు. తాము ఎక్కడో దారి తప్పిపోయామని చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడవడం ప్రారంభించిందని.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ద్వారా నడిచిందని ప్రియాంక అన్నారు. అందుకే తాము ముఖ్యమంత్రిని మార్చాలని అన్నారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూతో ఆధిపత్య పోరు తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్‌ను రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా సిద్ధూ నియమితులయ్యారు. అమరీందర్ సింగ్ స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఇది మాజీ అకాలీదళ్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్)తో పొత్తుతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.