నేషనల్ హెరాల్డ్ కేసులో తన పాత్రపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను ఐదు రోజుల పాటు ప్రశ్నించడం తనపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు. ఈడీ, అలాంటి ఏజెన్సీలు తనను ప్రభావితం చేయవని.. తనను నన్ను విచారించిన అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని భయపెట్టలేరని, అణచివేయలేరని అర్థం చేసుకున్నారని AICC ప్రధాన కార్యాలయంలో జరిగిన సంభాషణలో చెప్పుకొచ్చారు. ఈడీ విచారణ సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ధన్యవాదాలు తెలిపారు. తాను ఒంటరిగా లేనని తనతో ప్రజాస్వామ్యం(Democracy) కోసం పోరాడుతున్నవాళ్లు ఉన్నారని అన్నారు.
బీజేపీకి(BJP) వ్యతిరేకంగా గళం విప్పినందుకే కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. సాయుధ దళాలలో స్వల్పకాలిక రిక్రూట్మెంట్ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త అగ్నిపథ్(Agnipath) పథకాన్ని రాహుల్ గాంధీ విమర్శించారు. సైన్యాన్ని బలోపేతం చేయాలని అన్నారు. మోదీ ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు. ఇది యుద్ధ సమయంలో ప్రతికూల పరిణామాలను కలిగి ఉంటుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నవారు అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది స్పష్టంగా రాజకీయ ప్రేరేపిత చర్య అని విమర్శించారు. ఇది సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గురించి మాత్రమే కాదని.. మొత్తం ప్రతిపక్షానికి సంబంధించినదని వ్యాఖ్యానించారు.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..
Draupadi Murmu: చీపురు పట్టి శివాలయాన్ని ఊడ్చిన కాబోయే రాష్ట్రపతి.. వీడియో వైరల్
ఈడీ ఐదు రోజుల పాటు రాహులల్ గాంధీని ప్రశ్నించింది. గాంధీ కుటుంబం యంగ్ ఇండియన్ యాజమాన్యం, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను నడుపుతున్న అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్‌లో దాని వాటా గురించి రాహుల్‌ను ప్రశ్నిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు చెందిన అన్ని ఆస్తులకు యజమానిగా మారిన AJLని 2010లో తక్కువకి కొనుగోలు చేసిన పరిస్థితుల గురించి రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.