హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Priyanka Gandhi: యూపీలోని లఖీంపూర్‌ ఖేరీ జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన.. అడ్డుకున్న పోలీసులు

Priyanka Gandhi: యూపీలోని లఖీంపూర్‌ ఖేరీ జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన.. అడ్డుకున్న పోలీసులు

ప్రియాంకా గాంధీ వాద్రా

ప్రియాంకా గాంధీ వాద్రా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న జరిగిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లఖీంపూర్‌ ఖేరీకి బయల్దేరారు. కాగా ఈ రోజు ఉదయం పోలీసులు ఆమెను నిర్బంధించారు.

ఇంకా చదవండి ...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని (UttarPradesh) లఖీంపూర్‌ ఖేరీ (Lakhimpurkhiri) జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) లఖీంపూర్‌ ఖేరీకి (Lakhimpurkhiri) బయల్దేరారు. కాగా ఈ రోజు ఉదయం పోలీసులు ఆమెను నిర్బంధించారు. ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ అజయ్ కుమార్ మిశ్రా (Ajay Kumar Mishra) కాన్వాయ్‌లోని ఓ కారు రైతుల పైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దాంతో నలుగురు రైతులు మరణించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు (Farmers Protest) చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన తర్వాత రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీరి నిరసనలు ఇప్పుడు మరింత హింసాత్మకంగా (Violence) మారుతున్నాయి.

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు నిన్న రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో మంత్రి కారు రోడ్డు పక్కనే ఆందోళనలు చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం చెందడంతో లఖీంపూర్‌ ఖేరి జిల్లాలో హింసాకాండ ప్రారంభమైందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో వాహనాలు దగ్ధం చేయడం వంటి హింసాత్మక దృశ్యాలు కనిపించాయి.

అయితే కాన్వాయ్ ఘటనలో బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక గాంధీ సోమవారం బయలుదేరారు. సీతాపూర్ రాగానే అక్కడ పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులపై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. "మీరు చంపిన వ్యక్తులు, మీరు సమర్థిస్తున్న ప్రభుత్వం కంటే నేను ముఖ్యం కాదు కదా! మీరు నాకు లీగల్ వారెంట్, లీగల్ ప్రాతిపదిక ఇచ్చి అడ్డుకోండి. లేదంటే నేను ఇక్కడి నుంచి కదలను. మీరు నన్ను తాకడానికి కూడా వీలు లేదు" అని సీతాపూర్‌లో ఆమె పోలీసులపై ధ్వజమెత్తారు. పక్కకి జరగాలంటూ ఒక మహిళా పోలీసు ఆమెను అభ్యర్థించిన్నట్లు సమాచారం. ప్రియాంక గాంధీ వాద్రాను సీతాపూర్ పోలీస్ లైన్‌కు తీసుకువెళుతున్నారని.. ప్రజలు అక్కడికి రావాలని యూపీ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక వీడియోను ట్వీట్ చేసింది.

వారెంట్ లేదా లీగల్ ఆర్డర్‌ ఇచ్చి తనని అడ్డుకోవాలంటూ ఆమె పోలీసులకు తెలిపారు. లేదంటే తాను ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ మీరు నన్ను ఆ కారులో ఎక్కించుకుంటే.. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్లు కేసు ఫైల్ చేస్తానని ఆమె హెచ్చరించారు. ఈ కేసు అనేది మొత్తం పోలీసులపై కాదు కానీ తనని అడ్డుకునే ఒక్క పోలీస్ పైనే పెడతానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆమె పక్కన కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హుడా ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రాపై ఎలా చేయి చేసుకుంటారని అతడు ఒక పోలీసును ప్రశ్నించారు. ఈ ఉద్రిక్తతలలో ప్రియాంకపై పోలీసులు చెయ్యి చేసుకున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు.

ఇది కూడా చదవండి: Lakhimpur: రైతులపై కారెక్కించడం దారుణం.. లఖింపూర్​ ఘటనపై కేంద్రంపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు..

కానీ హుడా మాట్లాడుతూ.. పోలీసుల భౌతిక దాడి గురించి తాను సాక్ష్యమివ్వబోతున్నానని.. వారి అరాచకాలు కళ్లారా చూశానని చెప్పారు. ఇంతలో ఒక పోలీస్ అధికారి హుడాని ఒక కారులోకి తరలించే ముందు గట్టిగా తోస్తూ తీసుకెళ్లారు. ఇది చూసి.. "మళ్లీ మొదలెట్టారా.. ఆపండి" అని ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వెళ్లగక్కారు.

ఒక మహిళతో కూడా మాట్లాడలేని మీరు హుడాని కొడతారా? అంటూ ప్రియాంక గాంధీ జోక్యం చేసుకున్నారు. అనంతరం హుడాపై దాడి చేయనివ్వకుండా పోలీసుల బృందానికి అడ్డుగా నిలబడ్డారు. వారెంట్ లేదా లీగల్ ఆర్డర్‌ ఇచ్చి తమని అడ్డుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంక గాంధీకి మద్దతుగా ట్వీట్ చేశారు. తన సోదరి, కాంగ్రెస్ నేతలు రైతులను గెలిపిస్తారని పేర్కొన్నారు. "ప్రియాంక.. మీరు వెనక్కి తగ్గరని నాకు తెలుసు.. మీ ధైర్యానికి వారు ఆశ్చర్యపోయారు. న్యాయం కోసం జరిగే ఈ అహింసా పోరాటంలో మనం ఈ దేశ అన్నదాతలు గెలిచేలా చేయగలం" అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Published by:Sambasiva Reddy
First published:

ఉత్తమ కథలు