CONGRESS LEADER PRIYANKA GANDHI STARTS GANGA YATRA FROM SANGAM TO VARANASI AS ELECTION CAMPAIGN NK
గంగా యాత్ర : అప్పుడు ఇందిరా గాంధీ పూజ చేశారు... ఇప్పుడు ప్రియాంక కూడా అక్కడే...
గంగా యాత్ర ప్రారంభానికి ముందు ప్రయాగరాజ్కు చేరుకున్న ప్రియాంక గాంధీ...అక్కడి హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. గతంలో ఇక్కడ ప్రియాంక గాంధీ నాన్నమ్మ ఇందిరా గాంధీ కూడా పూజలు నిర్వహించారు (Image : Twitter)
Lok Sabha Elections 2019 : మాజీ ప్రధాని ఇందిరను గుర్తు చేస్తూ గంగానదిపై ప్రియాంక గాంధీ చేస్తున్న ప్రయాణం ప్రత్యర్థి పార్టీలను ఆలోచనలో పడేస్తోంది.
ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికల ఇన్ఛార్జి అయిన ప్రియాంక గాంధీ... ప్రతి విషయంలో నాన్నమ్మ ఇందిరా గాంధీని గుర్తు చేస్తున్నారు. పోలికలు, హావ భావాల్లో అచ్చం నాన్నమ్మలా కనిపించే ప్రియాంక... వేసే అడుగుల్లోనూ ఇందిరా గాంధీ గుర్తు వచ్చేలా చేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ ఆమె ప్రారంభించిన గంగా యాత్రే. పవిత్రమైన గంగానదిపై ప్రయాణం చేయడం ద్వారా యాదవేతరులకు చేరువ కావచ్చని ప్రియాంక భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ త్రివేణీ సంగమం నుంచీ ప్రియాంక గాంధీ ప్రారంభించిన 140 కిలోమీటర్ల స్టీమర్ బోటు ప్రయాణం... వారణాసిలోని అస్సీ ఘాట్ వరకూ మూడు రోజుల పాటూ సాగనుంది.
బోటు ప్రయాణానికి ముందు ప్రియాంకా గాంధీ ప్రయాగరాజ్ వెళ్లారు. అక్కడి ప్రముఖ హనుమాన్ మందిరంలో పూజలు, అర్చనలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు హనుమాన్ ఆశీర్వాదం తీసుకున్నారు.
హనుమాన్ ఆలయంలో ప్రియాంక గాంధీ పూజలు
అప్పట్లో ప్రియాంక నాన్నమ్మ ఇందిరా గాంధీ కూడా ఇదే ఆలయంలో పూజలు చేశారు. నాన్నమ్మ పోలికలతో ఉన్న ప్రియాంక గాంధీ కూడా ఇదే ఆలయంలో పూజలు చెయ్యడంతో... ఆ విషయాన్ని గుర్తు చేస్తూ... అప్పటి ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది యూపీ కాంగ్రెస్ విభాగం.
ఆలయంలో పూజల తర్వాత ఆమె... త్రివేణీ సంగమం చేరుకుని గంగా, యమునా, సరస్వతికి ప్రత్యేక పూజలు చేశారు.
Priyanka Gandhi Vadra at Triveni Sangam, to start 3-day long 'Ganga-yatra' from Chhatnag in Prayagraj to Assi Ghat in Varanasi, today. pic.twitter.com/A6gjtbod33
త్రివేణీ సంగమం నుంచీ ప్రత్యేకంగా తయారు చేసిన స్టీమర్ బోటులో ఎన్నికల ప్రచార ప్రయాణం ప్రారంభించారు. పడవ ప్రయాణంలో అక్కడి విద్య, నిరుద్యోగంపై యువతను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రియాంక కోసం స్టీమర్ (Image : Twitter)
గంగానదిపై ప్రయాణిస్తూ... వారణాసి సహా యాదవేతరులు నివసించే ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకుంటున్న ప్రియాంక గాంధీ... అన్ని వర్గాల వారినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీలో 14 శాతం ఉన్న యాదవేతరుల ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. గాంగానది చుట్టుపక్కల నివసించే వారిని ఆకర్షించేందుకు గంగానదిపై ప్రయాణిస్తూ ప్రచారం చెయ్యడమే సరైన నిర్ణయమని భావించారు.
Prayagraj: Congress General Secretary UP-East Priyanka Gandhi Vadra begins 3-day long 'Ganga-yatra' from Manaiya ghat to Assi Ghat in Varanasi. pic.twitter.com/IY5Dkek6Jc
ప్రియాంక గాంధీని మొదట్లో తేలిగ్గా తీసుకున్న ఎస్పీ-బీఎస్పీ కూటమి, బీజేపీ నేతలు... ఇప్పుడు మాత్రం ఆమె ప్రతి కదలికనూ గమనిస్తున్నారు. ప్రచారం విషయంలో ఎవరికి వారు ఎత్తుగడలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Video : హనుమాన్ ఆలయంలో ప్రియాంక పూజలు
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.