Home /News /national /

CONGRESS LEADER PRIYANKA GANDHI INTERESTING COMMENTS WEATHER SHE CONTEST IN DIRECT ELECTIONS OR NOT SK

Priyanka Gandhi: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రియాంకా గాంధీ వాద్రా (File)

ప్రియాంకా గాంధీ వాద్రా (File)

ప్రియాంక గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అని కామెంట్ చేస్తున్న బీజేపీ నేతలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. నేను, రాహుల్ గాంధీని సీరియస్ పొలిటిషియన్స్ కాదని ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని ప్రియాంక గాంధీ జోస్యం చెప్పారు.

ఇంకా చదవండి ...
    వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కాయి. అన్ని పార్టీలు వ్యూహ రచనలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యూపీలో పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన బ్లాక్ పంచాయతీ అధ్యక్షుల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల చేతిలో దౌర్జన్యానికి గురైన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను ఆమె పరామర్శించారు. వేరే పార్టీకి చెందిన కార్యకర్తలయినప్పటికీ.. వారిని తన సోదరీమణులుగా భావించి పరామర్శకు వచ్చాచని చెప్పారు ప్రియాంక గాంధీ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర వ్యాక్యలు చేశారు. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా? అని విలేఖరులు అడగడంతో 'చూద్దాం' అని సమాధానం ఇచ్చారు. 'అన్నీ ఇప్పుడే చెప్పాలా?' అని బదులిచ్చారు.

    ఆదివారం లక్నోలో పర్యటించిన ప్రియాంక గాంధీ యూపీలో పొత్తులపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 403 స్థానాల్లో పోటీచేస్తుందా? లేదంటే ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటారా? అని విలేఖరులు ప్రశ్నంచగా.. పొత్తులు ఉండవని ఇప్పుడే చెప్పలేనని అన్నారు. మేము క్లోజ్ మైండెడ్ కాదని.. ఓపెన్ మైండెడ్ అని సమాధానం ఇచ్చారు. అన్ని పార్టీలు కూడా ఓపెన్ మైండెడ్‌గా ఉండాలని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యమని.. అందుకోసం ఇతర పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని పరోక్షంగా సంకేతాలిచ్చారు ప్రియాంక గాంధీ. తాను యూపీకి వచ్చినప్పుడు మాత్రమే మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుందని.. కానీ తమ పని తాము చేసుకుంటూపోతున్నామని ఆమె తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేశామని వెల్లడించారు.

    ఇక ప్రియాంక గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అని కామెంట్ చేస్తున్న బీజేపీ నేతలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. నేను, రాహుల్ గాంధీని సీరియస్ పొలిటిషియన్స్ కాదని ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని ప్రియాంక గాంధీ జోస్యం చెప్పారు. అనంతరం యూపీ కాంగ్రెస్ నేతలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, కో ఇంచార్జి ధీరజ్ గుజ్రార్, యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్, నసీముద్దీన్ సిద్దిఖీ పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆమె చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొత్తుల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Priyanka Gandhi, Up news, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు