Home /News /national /

CONGRESS LEADER PRIYANKA GANDHI HAS ANNOUNCED THAT IF HER PARTY WINS THE ELECTIONS GIRLS WILL BE GIVEN TWO WHEELERS AND MOBILE PHONES PRV PRV

Uttar Pradesh: ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే బాలికలకు ద్విచక్ర వాహనం.. మొబైల్​ ఫోన్ ​”: కాంగ్రెస్​ నాయకురాలు  ప్రియాంకా గాంధీ హామీలు

ప్రియాంకా గాంధీ (Photo: priyankagandhi/Twitter)

ప్రియాంకా గాంధీ (Photo: priyankagandhi/Twitter)

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Uttar Pradesh Assembly elections) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ పార్టీ (UP Congress News) హమీల జల్లు కురిపిస్తుంది. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు ప్రియాంక.. ఇప్పుడు దానిని ప్రస్తావిస్తూ బాలికలకు ఉచిత ఇ-స్కూటీ (scotty), మొబైల్ ఫోన్లు ఇస్తామని ఆమె అన్నారు.

ఇంకా చదవండి ...
    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Uttar Pradesh Assembly elections) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ పార్టీ (UP Congress News) హమీల జల్లు కురిపిస్తుంది. ఇటీవలె కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) రైతులకు పలు హామీలు ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే అన్నదాతల రుణాలు (loans) మాఫీ చేస్తామని చెప్పారు. వరి, గోధుమలకు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు (Jobs) భర్తీ చేస్తామని ప్రియాంక (Priyanka Gandhi news latest) తెలిపారు. కరోనా సంక్షోభం వల్ల ఎదురైన నష్టం నుంచి బయటపడేందుకు ఒక్కో పేద కుటుంబానికి (family) రూ. 25 వేలు అందిస్తామని చెప్పారు. విద్యుత్ బిల్లులను పేద కుటుంబాలకు పూర్తిగా, మిగిలిన వారికి సగం మాఫీ చేస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు ప్రియాంక.. ఇప్పుడు దానిని ప్రస్తావిస్తూ బాలికలకు ఉచిత ఇ-స్కూటీ (scotty), మొబైల్ ఫోన్లు ఇస్తామని ఆమె పునరుద్ఘాటించారు.

    పార్టీ తరఫున బాలికలకు ద్విచక్ర వాహనాలతో పాటు స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని  ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) అన్నారు. అంతే కాకుండా పార్టీలో 40 శాతం టిక్కెట్లను మహిళలకు కేటాయించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రియాంకా గాంధీ స్పందించారు.

    బాలికలకు ద్విచక్ర వాహనం..

    రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే (Congress Pratigya Yatra) మహిళ సాధికారత కోసం పక్కా ప్రణాళికలను రూపొందిస్తామని ప్రియాంకా గాంధీ తెలిపారు. వీటితో పాటు పలు హామీలను నేరవేరుస్తామని ట్విట్టర్ (Twitter) వేదికగా ఆమె ప్రకటించారు. ప్రియాంకా గాంధీ ట్విట్టర్లో .. ఉత్తరప్రదేశ్‌లోని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. బాలికలకు ద్విచక్ర వాహనం (Two wheeler) ఇస్తాం. స్మార్ట్ ఫోన్ (Smartphone)​ అందజేస్తాం. మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు (Bus services), మూడు గ్యాస్ సిలిండర్లు (Gas cylinders) ఉచితంగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. పార్టీలో 40 శాతం సీట్లు మహిళలకు (Women) కేటాయిస్తాం. వితంతువులకు నెలకు రూ. వెయ్యి అందజేస్తాం. మహిళలకు అండగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తాం” అని రాశారు.



    గోరఖ్‌ పూర్‌లో..

    కాగా,  ఇటీవల ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని గోరఖ్‌ పూర్‌లో జరిగిన సభలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ బీజేపీపై ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ (Indira Gandhi) వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞా ర్యాలీకి హాజరయ్యారు ప్రియాంకా. భాజపా (BJP) పాలనపై నిప్పులు చెరిగారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే అటు కేంద్ర , ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ప్రియాంకా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రజల కష్టాలను సీఎం యోగి ఆదిత్యానాథ్​ (Yogi Aditya nath) పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు (law and orders) అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Union Home minister Amit shah) ప్రశంసిస్తున్నారని, కాని, ఆయన పక్కనే మంత్రి అజయ్‌ మిశ్రా (Ajay Mishra) లాంటి వారు ఉన్న విషయాన్ని మర్చిపోయారని ప్రియాంక మండిపడ్డారు. రైతులను తన కొడుకు.. కాన్వాయ్‌తో తొక్కించినా కేంద్ర మంత్రి స్వేచ్చగా తిరుగుతున్నారని ప్రియాంక విమర్శించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, Priyanka Gandhi, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections, Women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు