హోమ్ /వార్తలు /జాతీయం /

పీఓకేలో అసలు వైమానిక దాడులు చేశారా... ఎవరైనా ఉగ్రవాదులు చచ్చారా? కపిల్ సిబల్ అనుమానాలు

పీఓకేలో అసలు వైమానిక దాడులు చేశారా... ఎవరైనా ఉగ్రవాదులు చచ్చారా? కపిల్ సిబల్ అనుమానాలు

కపిల్ సిబల్ (File)

కపిల్ సిబల్ (File)

India Vs Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌లో భారత వాయుసేన చేసిన వైమానిక దాడుల అంశాన్ని రాజకీయం చేస్తున్నారు కపిల్ సిబల్. బీజేపీ అబద్ధాలు చెబుతోందని ఆరోపిస్తున్నారు.

దేశ భద్రతకు సంబంధించిన అంశాల విషయంలో... ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్ధపడరు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాత్రం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులపై అనుమానం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నట్లే... బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన దాడుల్లో ఉగ్రవాదులు చనిపోయారు అనేందుకు ఆధారాలు కనిపించట్లేదన్నారు. అంతర్జాతీయ మీడియా గనక పాకిస్థాన్‌కి అనుకూలంగా వ్యవహరిస్తోందని ప్రధాని భావిస్తున్నట్లైతే... ఆ కథనాలపై ప్రధాని స్పందించాలని కోరారు.
శనివారం కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ కూడా పాకిస్థాన్‌లో భారత వైమానిక దాడులపై అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల కిందట పాకిస్థాన్‌లో బాంబులు జారవిడిచారన్న ఆయన... బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలన్నీ నాశనమైతే... న్యూయార్క్ టైమ్స్ మాత్రం అక్కడ ఎలాంటి నష్టమూ జరగలేదని అందని అజయ్ సింగ్ తెలిపారు. ఈ రోజు కాకపోయినా ఓ పది రోజుల్లో నిజం బట్టబయలు అవుతుందన్నారు.


కాంగ్రెస్ నేతల ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ పురీ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత సైన్యం చర్యల్ని అనుమానించడం సబబు కాదన్నారు. పుల్వామా ఉగ్ర దాడికి పాల్పడిన సంస్థపై వైమానిక దాడులు జరిగాయన్న ఆయన... అలాంటి వాటిపై అనుమానం వ్యక్తం చేసే బుద్ధిహీనులకు ఈ దేశంలో కొరత లేదన్నారు. దేశంలో ఎక్కువ మంది మాత్రం వైమానిక దాడుల్ని సమర్థిస్తున్నారని అన్నారు.


ఫిబ్రవరి 26న జరిపిన దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారన్నదానిపై కేంద్ర ప్రభుత్వం గానీ, సైన్యం గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం 250 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు ఆదివారం అన్నారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో చేసిన దాడిలో మాత్రం 40 మంది భారత సైనికులు చనిపోయారు.


 


ఇవి కూడా చదవండి :


ఫోన్ నంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా? సింపుల్ ట్రిక్


యూట్యూబ్‌ వీడియోలో కొంత భాగమే డౌన్‌లోడ్ చెయ్యాలా... సింపుల్ ట్రిక్


వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చెయ్యడం ఎలా?


యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకుండా ఆ వీడియోలు చూడటం ఎలా... ఇలా చెయ్యండి

First published:

Tags: National News, Pulwama Terror Attack, Surgical Strike 2

ఉత్తమ కథలు