హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో బీజేపీ (Bjp)కి కాంగ్రెస్ భారీ షాకిచ్చింది. ఇప్పటికి వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ (Congress) అనూహ్యంగా దూసుకొచ్చింది. ఏకంగా 38 స్థానాల్లో కాంగ్రెస్ (Congress) ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ కేవలం 27 స్థానాలకే పరిమితం అయింది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఎవరు ఎన్ని సీట్లలో విజయం సాధించారనేది క్లారిటీ రానుంది. హిమాచల్ లో మొత్తం 68 స్థానాలు కాగా మేజిక్ ఫిగర్ 35 స్థానాలు..అయితే ఇప్పటికే హస్తం (Congress) పార్టీ 38 స్థానాల్లో ముందజలో ఉంది. ఇక ఇదే జోరు కొనసాగితే హిమాచల్ లో కాంగ్రెస్ (Congress) అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్ ..
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతుంది. చివరి వరకు ఇదే రిజల్ట్ వస్తే హస్తం పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ కేవలం 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గాలం వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలించాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ దీనిని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్ రాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థుల ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.
హిమాచల్(Himachal Pradesh)లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబరు 12న ఒకే దశలో ఇక్కడ పోలింగ్ జరిగింది. హిమాచల్ లో 74 శాతం ఓటింగ్ నమోదయింది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్ల సంఖ్య 35. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. 35 ఏళ్ల హిమాచల్ ఎన్నికల చరిత్ర చూస్తే ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఒకసారి బీజేపీ గెలిస్తే.. ఒకసారి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రస్తుత ఫలితాలు కూడాబీజేపీ-కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు వార్ నడుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Himachal Pradesh, Himachal Pradesh Elections 2022