Home /News /national /

CONGRESS INTERIM PRESIDENT SONIA GANDHI TESTS POSITIVE FOR COVID19 AGAIN PVN

Sonia Gandhi : సోనియా గాంధీకి మరోసారి కరోనా..రెండు నెలల్లో రెండోసారి పాజిటివ్

సోనియా గాంధీ(ఫైల్ ఫొటో)

సోనియా గాంధీ(ఫైల్ ఫొటో)

Sonia gandhi gets covid positive :  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Sonia gandhi gets covid positive :  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ లక్షణాలు కన్పించడంతో ఇవాళ జరిపిన పరీక్షలో ఆమెకు పాజిటివ్(Sonia gandhi gets covid positive) గా తేలినట్లు తెలిపారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆమె ప్రస్తుతం హోం ఐసోలేష‌న్‌(Home Isolation)లో ఉన్నార‌ని తెలిపారు.

కాగా,రెండు నెలల వ్యవధిలో సోనియా గాంధీ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్ లో క‌రోనా బారిన ప‌డిన సోనియా గాంధీ..వారం రోజుల వ్య‌వ‌ధిలోనే సోనియా కోలుకుంది. అయితే కొవిడ్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఆమె జూన్ 12న‌ ఢిల్లీలోని స‌ర్‌ గంగా రామ్ హాస్పిట‌ల్‌లో చేరి ట్రీట్మెంట్ పొందిన విష‌యం తెలిసిందే. మరోవైపు,బుధవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా మూడు నెలల్లో రెండవ సారి కరోనా బారినపడినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.



మరోసారి విజృంభిస్తున్న కరోనా .. 24 గంటల్లో 10 మరణాలు.. ఎక్కడంటే..

శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 15,815 కొత్త కోవిడ్ కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1,19,264కి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 4.36శాతంగా ఉంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona positive, Covid test, Sonia Gandhi

తదుపరి వార్తలు