కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎన్నికలకు ముందే ఆ నేతలకు షాక్

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు సచిన్ పైలెట్, సిద్ధూ, అజారుద్దీన్, అశోక్ గెహ్లాట్, కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి వారికి చోటు దక్కింది.

  • Share this:
    త్వరలోనే పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొబోతున్న కాంగ్రెస్ పార్టీ.. అంతకంటే ముందే అసంతృప్తి నేతలకు చెక్ పెట్టేందుకు నిర్ణయించినట్టు కనిపిస్తోంది. అధిష్టానం నిర్ణయాలను, నాయకత్వాన్ని ప్రశ్నించిన పలువురు సీనియర్ నేతలపై సోనియా, రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే వారి విషయంలో తమకు అలాంటి ఉద్దేశ్యం లేదని కాంగ్రెస్ ముఖ్యనేతలు చెబుతూ వచ్చారు. అయితే తమ నాయకత్వాన్ని ప్రశ్నించిన నేతలను పక్కనపెట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం... తాజాగా పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వారికి చోటు కల్పించలేదు.

    బెంగాల్‌లో తమ పార్టీ తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గులాం నబీ ఆజాద్ సహా 22 మందికి ఈ లిస్టులో చోటు కల్పించలేదు. వీరిలో ఒక్క అఖిలేష్ ప్రసాద్ సింగ్‌కు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇక స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు సచిన్ పైలెట్, సిద్ధూ, అజారుద్దీన్, అశోక్ గెహ్లాట్, కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి వారికి చోటు దక్కింది.
    Published by:Kishore Akkaladevi
    First published: