గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Assembly Elections 2022) షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) దూకుడు ప్రదర్శిస్తుంది. తమ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ (Congress) రిలీజ్ చేసింది. కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) అధ్యక్షతన పార్టీ సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ సమావేశంలో 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో గాంధీనగర్ సౌత్ (Gandhinagar South), సూరత్ వెస్ట్ (Soorath West), జామ్ నగర్ నార్త్ (Jaam Nagar North), రాజ్ కోట్ రూరల్ (Raaj Kot Rural), రాజ్ కోట్ సౌత్ (Raaj Kot South) తో సహా పలు నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను రిలీజ్ చేశారు.
ચાલો જીતવા જંગ બ્યુગુલો વાગે, યા હોમ કરીને કૂદી પડો ફતેહ છે આગે
વિધાનસભાની ચૂંટણી માટે પસંદગી પામેલ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/CnP7IACxAt — Gujarat Congress (@INCGujarat) November 4, 2022
గుజరాత్ రాష్ట్రం బీజేపీకి కంచుకోట. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అంటే బీజేపీ అనే ట్యాగ్ ఉంది. అలాగే బీజేపీ చేతిలో కాంగ్రెస్ వరుసగా ఆరుసార్లు ఓడిపోయింది. మరి ఈసారి ఆప్ ఎంట్రీతో గుజరాత్ లో త్రిముఖ పోటీ నెలకొంది. గుజరాత్ లో ఎలాగైనా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తహతహలాడుతుంది. అలాగే ఈసారి గుజరాత్ లో గెలిచి పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు (Gujarat Election Schedule) నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి. తొలి దశ ఎన్నికలకు నవంబరు 5 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 14వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబరు 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబరు 1న తొలి దశ పోలింగ్ ఉంటుంది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 41వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.