Udaipur Murder Case : రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని ఉదయ్ పూర్(Udaipur)లో మంగళవారం కన్హయ్య లాల్ అనే ఓ టైలర్(Tailor)ని ఇద్దరు ముస్లిం యువకులు దారుణంగా కత్తులతో నరికి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిషృత నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని టైలర్(Tailor)ని ఇద్దరు దుండగులు దారుణంగా కత్తులతో నరికి చంపారు. దారుణంగా చంపేసిన తర్వాత ఆ ఇద్దరు అగంతకులు టైలర్ ని చంపుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. . ప్రధాని మోదీని కూడా చంపుతామని ఆ వీడియోలో హెచ్చరించారు. ఆ వీడియోలో ఇద్దరు నిందితుల్లో ఒకరు తనను తాను రియాజ్ అని, మరొకరు మహ్మద్ అని పరిచయం చేసుకున్నారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ఇస్లాం సంస్థలు కూడా ఈ హత్య ఘటనను ఖండించాయి. ఈ ఘటన ఇస్లాంకు వ్యతిరేమని పేర్కొన్నాయి.
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యా లాల్‌ను దుండగులు పదునైన కత్తితో 26 సార్లు నరికినట్టు పోస్టుమార్గం నివేదికలో వెల్లడైంది. తలపై 8-10 సార్లు నరికారు. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు చనిపోయాడని రిపోర్ట్ తేల్చింది. కాగా ఉదయ్‌పూర్‌లోని కన్హయ్యా లాల్ స్వస్థలం మల్దాస్ ప్రాంతంలో అంత్యక్రియలు జరిగాయి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ కన్హయ్య అంతిమ యాత్రకు జనం పోటెత్తారు. పలు పార్టీలకు చెందిన నాయకులు కూడా వచ్చారు.
Relationship Tips : ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉండాలంటే ఇలా చేయండి
కాగా హత్య గురి కావడానికి ముందు. తన ప్రాణాలకు ముప్పు ఉందని కన్హయ్య జూన్ 15న పోలీసులకు ఫిర్యాదు చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసులు ఇరు వర్గాలను కాంప్రమైజ్ చేసి పంపించారని... ప్రాణ భయంతో ఆరు రోజులపాటు షాప్ తెరవని కన్హయ్య... మంగళవారం దుకాణం తెరిచాడని.. అదే రోజు హత్యకు గురయ్యాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు అప్పుడే యాక్షన్ తీసుకొని ఉండుంటే అతడు బతికి ఉండేవాడని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులపై తీవ్ర విమర్శలు రావడంతో రాజస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కన్హయ్య లాల్ హత్య కేసు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేశారు. సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఉదయ్‌పూర్ ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు రాజస్తా పోలీస్ చీఫ్ ఎంఎల్ లాథర్ తెలిపారు.
ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహమ్మద్‌లను అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించారు. పాక్‌లోని దావత్ ఏ ఇస్లామీ గ్రూపుతో హంతకులకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కరాచీలో వీరు శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్నారు. వీరితో పాటు మరికొందరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మొహమ్మద్ లను గురువారం కోర్టుముందు హాజరుపరిచారు. ఆ ఇద్దర్నీ 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, IPS, Rajastan