• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CONGRESS GENERAL SECRETARY PRIYANKA GANDHI VADRA TOOK A DIP IN SANGAM AND VISITED ANAND BHAWAN IN UTTARPRADESH MS

Priyanka Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. యూపీలో ప్రియాంక సుడిగాలి పర్యటనలు

Priyanka Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. యూపీలో ప్రియాంక సుడిగాలి పర్యటనలు

ప్రియాంక గాంధీ(File Photo)

యూపీలో పునర్ వైభవానికి హస్తం నేతలు పాకులాడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ అక్కడ ముమ్మరంగా పర్యటిస్తున్నారు. మహిళలపై రేప్ లు, రైతుల తరఫున పోరాటాలు, హక్కుల కార్యకర్తలపై యోగి సర్కారు కేసులు పెట్టడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    2022లో ఉత్తరప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. భౌగోళికంగా పెద్ద రాష్ట్రం కావడంతో ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే ఢిల్లీ గద్దెను సాధించడం పెద్ద విషయమేమీ కాదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి అత్యధిక మంది ఎంపీలు ఇక్కడి నుంచే ఉన్నారు. అయితే.. గతంలో యూపీని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ తదనంతర కాలంలో కనీసం చెప్పుకోదగ్గ స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది. యూపీలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న రాయ్ బరేలి, అమేథి స్థానాలు. 2019 లోక్సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ సైతం అమేథీ నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే.

    దీంతో యూపీలో పునర్ వైభవానికి హస్తం నేతలు పాకులాడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ అక్కడ ముమ్మరంగా పర్యటిస్తున్నారు. మహిళలపై రేప్ లు, రైతుల తరఫున పోరాటాలు, హక్కుల కార్యకర్తలపై యోగి సర్కారు కేసులు పెట్టడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు.





    యూపీలో ప్రభుత్వ వ్యతిరేకంగా ఏ చిన్న ఘటన నమోదైనా దానిని ముందుకు నడిపించడంలో ప్రియాంక గాంధీ ముందుంటున్నారు. తాజాగా ఆమె ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు. మౌని అమవాస్య సందర్భంగా ఆమె గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక్కడే ఉన్న సంగమేశ్వర్ లోని మంకమేశ్వర్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలుచేశారు.





    అనంతరం స్వామి స్వరూపానంద సరస్వతి మఠాన్ని సందర్శించారు. దాంతో పాటు చరిత్రాత్మకమైన ఆనంద్ భవన్ ను కూడా ఆమె సందర్శించారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు