• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CONGRESS GAINS VICTORY IN SEVEN MUNICIPAL CORPORATION ELECTIONS IN PUNJAB AK

Punjab: బీజేపీకి షాక్.. పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం

Punjab: బీజేపీకి షాక్.. పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం

ఫ్రతీకాత్మక చిత్రం

Punjab: పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది.

  • Share this:
    వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రంగా ఉన్న పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలోకాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది. ఫిబ్రవరి 14న 109 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 71.39 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని బూత్ లలో మంగళవారం రీపోలింగ్ జరిగింది. మోగా, హోషియార్ పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్ కోట్, బాటాలా, బఠిండాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మరో స్థానం మొహాలీకి సంబంధించి రేపు ఫలితాలు వెలువడనున్నాయి.

    బఠిండా మున్సిపల్ కార్పొరేషన్‌లో 53 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. పంజాబ్ రాజకీయాల్లో ఈ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. బఠిండా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వం వహిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఎన్డీయే నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ రెండు పార్టీలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 9,222 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా 2,832 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీల వారీగా చూసుకుంటే.. కాంగ్రెస్ 2,037 మందిని పోటీలో నిలిపింది. శిరోమణి అకాలీ దళ్ తరఫున 1,569 మంది పోటీ చేయగా.. బీజేపీ నుంచి 1,003 మంది పోటీ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు