• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • CONGRESS ELECTION MANIFESTO NYAY SCHEME IS THE KEY POINT IN CONGRESS ELECTION MANIFESTO NK

లోక్ సభ ఎన్నికల అస్త్రంగా న్యాయ్... కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలెట్ అదే...

లోక్ సభ ఎన్నికల అస్త్రంగా న్యాయ్... కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలెట్ అదే...

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

Congress Election Manifesto : దేశంలో పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న కాంగ్రెస్... తన ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయ్ పథకాన్నే హైలెట్ చేసింది.

 • Share this:
  Congress Election Manifesto Highlight : దేశంలో అత్యంత పేదలు 25 కోట్ల మంది ఉన్నారని తేల్చిన కాంగ్రెస్ పార్టీ... ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే... నిరు పేదలందల కుటుంబాలకు నెలకు రూ.6000 చొప్పున ఏడాదికి రూ.72,000 వేల కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ప్రకటించింది. తాము అధికారంలోకి రాగానే... న్యూతమ్ ఆయ్ యోజన (న్యాయ్‌) లేదా కనీస ఆదాయ పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశంలో పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నామన్న కాంగ్రెస్... పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఈ స్కీం ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని తెలిపింది.

  ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... న్యాయ్ పథకాన్ని కచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు. ఐతే... బీజేపీ సహా కొన్ని పార్టీలు ఇలాంటి పథకం అమలు అసాధ్యమని అంటున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఏడాది కాలంగా ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై వివిధ నిపుణులు, ఆర్థిక వేత్తలతో చర్చించినట్లు తెలిపింది. పథకం అమలు సాధ్యమని తేలిన తర్వాతే... దీన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

  యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చిన కాంగ్రెస్... దాని ద్వారా దేశంలో 14 కోట్ల మందిని పేదరిక రేఖ ఎగువకు చేర్చామని తెలిపింది. అలాంటిదే అయిన తాజా పథకం ద్వారా 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ ఎగువకు చేర్చుతామని అంటోంది. ఇందుకోసం ఏడాదికి రూ.3.6 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా. తద్వారా దేశంలో పేదరికాన్ని తరిమికొట్టినట్లవుతోందని చెబుతూ... ఈ పథకాన్ని పేదరికంపై సర్జికల్ స్ట్రైక్‌గా అభివర్ణించారు రాహుల్.

  ప్రస్తుతం బీజేపీ ఉపాధి హామీ పథకం, ఆయుష్మాన్ భవ, ఎరువుల సబ్సిడీ వంటి పథకాలకు ఏటా రూ.7.8 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయని చెబుతోంది. ఈ లెక్కన ఆలోచిస్తే, కనీస ఆదాయ పథకం అమలు సాధ్యమే. ఇక్కడో లిటిగేషన్ ఉంది. ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.12 వేల ఆదాయం రావాలంటే... జీడీపీలో 1.5 శాతం అవుతుందనీ, అందువల్ల ఈ పథకం అమలును తమతోపాటూ... రాష్ట్రాలు కూడా పంచుకోవాలని రాహుల్ అంటున్నారు.


  అసలీ కనీస ఆదాయ పథకం వెనక ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఒత్తిడి ఉందన్నది మరో కోణం. రకరకాల పథకాలు, సబ్సిడీలు ఇచ్చే బదులు... వాటికి అయ్యే ఖర్చును... డబ్బు రూపంలో ప్రజలకు ఇవ్వాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రపంచ దేశాలు ఇప్పుడు డబ్బునే ఇస్తున్నాయి. మన దేశంలో కూడా రైతు బంధువు, పీఎం కిసాన్ ఇలాంటివే.

  పథకం చరిత్ర ఇదీ :
  * మహ్మద్ ప్రవక్త మామ, ఇస్లామిక్ రాజ్య తొలి పాలకుడు అబూ బకర్... ప్రతి సంవత్సరం కుటుంబానికి పది దిర్హామ్లు కనీస ఆదాయంగా ఇవ్వాలనే పథకం తెచ్చాడు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని 20కి పెంచాడు.
  * అమెరికాలో 1795లో భూ యాజమాన్య వ్యవస్థను తెచ్చినప్పుడు... ప్రజలు వారసత్వ ఆస్తుల్ని కోల్పోయారు. దాంతో థామస్ పెయిన... అమెరికా పౌరులకు పరిహారంగా పౌర లాభం పేరుతో కొంత మొత్తం ఇచ్చాడు.
  * 1966లో అమెరికాలో పథకాల ఖర్చులు తగ్గించేందుకు, అత్యంత పేదలకు కనీస వార్షిక ఆదాయ పథకం తెచ్చారు.
  * 1968లో 1200 మంది ఆర్థిక వేత్తలు ఒక మెమొరాండంపై సంతకాలు చేసి, ఆదాయ హామీ పథకాన్ని అమలు చెయ్యాలని కోరారు.

  ప్రస్తుతం చాలా దేశాల్లో కనీస ఆదాయ హామీ పథకాలు అమల్లో ఉన్నాయి. అవి కొన్ని షరతులతో అమలవుతున్నాయి. భారత్‌లో 1934లో కాంగ్రెస్ నేత సుభాష్ చంద్రబోస్ ముందుగా ఇలాంటి పథకం తేవాలని ప్రతిపాదించారు. 1942లో నెహ్రూ సారధ్యంలో ఓ కమిటీ వేశారు. కానీ పథకాన్ని అమలు చెయ్యలేదు. ఐతే... చాలా దేశాల్లో ఇలాంటి స్కీములు ఉన్నా... అవేవీ పేదరికాన్ని పూర్తిగా పోగొట్టలేకపోతున్నాయి. అయినప్పటికీ ఇలాంటి పథకాలు మాత్రం పేదల మద్దతు పొందుతున్నాయి.
  First published:

  అగ్ర కథనాలు