మే 17 తరువాత పరిస్థితేంటి..? కేంద్రానికి సోనియాగాంధీ సూటి ప్రశ్న

తమ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోనియాగాంధీ దృష్టికి తీసుకొచ్చారు.

news18-telugu
Updated: May 6, 2020, 3:43 PM IST
మే 17 తరువాత పరిస్థితేంటి..? కేంద్రానికి సోనియాగాంధీ సూటి ప్రశ్న
సోనియా గాంధీ (ఫైల్ చిత్రం)
  • Share this:
లాక్‌డౌన్‌ను ఎంతకాలం కొనసాగిస్తారనే అంశంపై కేంద్రం ఎలాంటి ప్రాతిపదిక అవలంభిస్తుందో చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్న సోనియాగాంధీ... ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనే దానిపై ముఖ్యమంత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికుల తరలింపు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఆమె ఈ సమావేశంలో చర్చించారు. తమ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోనియాగాంధీ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసే అంశంలో కేంద్రం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: May 6, 2020, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading