అమిత్ షా రాజీనామా చేయాలి... ఢిల్లీ అల్లర్లపై సోనియాగాంధీ రియాక్షన్

ఢిల్లీ అల్లర్ల వెనుక బీజేపీ నేత కుట్ర ఉందని సోనియాగాంధీ మండిపడ్డారు.

news18-telugu
Updated: February 26, 2020, 1:43 PM IST
అమిత్ షా రాజీనామా చేయాలి... ఢిల్లీ అల్లర్లపై సోనియాగాంధీ రియాక్షన్
సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఢిల్లీలో జరిగిన హింసను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలు బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ అల్లర్లకు బీజేపీయే కారణమని సోనియాగాంధీ ఆరోపించారు. ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారని విమర్శించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని ధ్వజమెత్తారు. ఢిల్లీ అల్లర్ల వెనుక బీజేపీ నేత కుట్ర ఉందని సోనియాగాంధీ మండిపడ్డారు. అల్లర్లకు బాధ్యత వహించి హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అల్లర్లు జరుగుతుంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తగినంత భద్రతను మొహరించాలని కోరారు. అల్లర్ల బాధితులకు కాంగ్రెస్ నేతలు సహాయం అందించాలని సోనియాగాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంకా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు కొనసాగుతున్నాయని... నిఘా వైఫల్యం వల్లే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సోనియాగాంధీ విమర్శించారు.


First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు