జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) (75) అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా కొవిడ్ (Covid-19) వ్యాధితో ఇబ్బంది పడుతూ అస్వస్థతకు గురైన ఆమె ఆదివారం ఆస్పత్రిలో చేరారు. దేశరాజధాని ఢిల్లీలోనే ప్రఖ్యాత గంగారాం ఆస్పత్రిలో సోనియా గాంధీ అడ్మిట్ అయిన విషయాన్ని కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు.
ఇటీవలే కరోనా బారిన పడిన సోనియా గాంధీ కొద్ది రోజులుగా కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే, కరోనా సంబంధిత సమస్యలతోనే ఆమె బధపడుతున్నారు. దీంతో వైద్యుల సూచన మేరకు సోనియాను ఢిల్లీ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, అబ్జర్వేషన్లో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు.
అధినేత్రి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్‌తో పాటు పలువురు రాజకీయ పార్టీ ప్రతినిధులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోనియా ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేయడం తెలిసిందే. గతంలోనూ ఓ సారి కరోనా బారినపడ్డారు సోనియా. కొన్నేళ్ల క్రితం అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ చీఫ్ తన కార్యక్రమాలను చాలా వరకు తగ్గించుకున్నారు. కాగా,
దేశంలో మరోసారి కరోనా మహ్మారి కోరలు చాస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం, దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అవగా, 5,24,761 మంది మరణించారు. మరో 44,513 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మహమ్మారికి నలుగురు బలవగా, 4,435 మంది బాధితులు వైరస్‌నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 0.10 శాతానికి చేరాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,07,08,541 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Covid, Delhi, Sonia Gandhi