Home /News /national /

CONGRESS CENTRAL ELECTION AUTHORITY ISSUES NOTIFICATION FOR AICC PRESIDENT POLLS SK

Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. రాహుల్ కాదు.. ఆ ముగ్గురే పోటీ..!

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

Congress President Elections: చివరి నిమిషం వరకు తాను రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని.. ఆయన అంగీకరించకుంటే.. అప్పడు ఎన్నికల్లో పోటీ చేస్తానని..అశోక్ గహ్లోత్ తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు  (Congress President Election) నోటిఫికేషన్ విడుదలయింది. గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నోటిఫికేషన్ (AICC President Election notification)  విడుదల చేశారు. సెప్టెంబరు 24 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 30 వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబరు 1న నామినేషన్లను పరిశీలించి.. అదే రోజున అర్హుల జాబితాను ప్రచురిస్తారు. నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు అక్టోబరు 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అధ్యక్ష ఎన్నికలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైతే.. ఎలాంటి ఎన్నికలు ఉండవు. ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ ఉంటే.. ఎన్నికలను నిర్వహిస్తారు. పోలింగ్ నిర్వహించాల్సి వస్తే.. అక్టోబరు 17న  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్టోబరు 19న ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు  మొదలవుతుంది. కౌంటింగ్ పూర్తైన వెంటనే.. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. ఐతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొగ్గుచూపడం లేదు. సీనియర్ నేతలు ఆయన్నే ప్రతిపాదించినా.. పలు రాష్ట్రాల పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసినా.. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)  పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లి.. ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీని కలిశారు. అటు శశి థరూర్ (Sashi Tharoor) కూడా రేసులో ఉన్నారు. నిన్న పార్టీ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీని కలిసి.. ఓటర్ల జాబితాను అడిగారు. ఇక తాజాగా దిగ్విజయ్ సింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. తాను రేసులో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. ఈసారి గాంధీయేతర నాయకులే ఏఐసీపీ పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అశోక్ గహ్లోత్‌ను తెరపైకి తెచ్చారు. ఐతే చివరి నిమిషం వరకు తాను రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని.. ఆయన అంగీకరించకుంటే.. అప్పడు ఎన్నికల్లో పోటీ చేస్తానని..అశోక్ గహ్లోత్ తెలిపారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చని.. మళ్లీ రాహుల్ గాంధీయే పగ్గాలు చేపట్టినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Aicc, Ashok gehlot, Congress, Rahul Gandhi, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు