దక్షిణాదిపై జాతీయ పార్టీల చూపు... సీట్లు పెంచుకోవడమే లక్ష్యం... అధినేతలు సౌత్‌లో పోటీ చేస్తారా

Lok Sabha Elections 2019 : నార్త్‌లో పోగొట్టుకున్నది సౌత్‌లో రాబట్టుకోవాలన్నది బీజేపీ ప్లాన్. సౌత్‌లో పోగొట్టుకున్నది, సౌత్‌లోనే రాబట్టుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం.

Krishna Kumar N | news18-telugu
Updated: March 24, 2019, 6:55 AM IST
దక్షిణాదిపై జాతీయ పార్టీల చూపు... సీట్లు పెంచుకోవడమే లక్ష్యం... అధినేతలు సౌత్‌లో పోటీ చేస్తారా
రాహుల్, మోదీ
  • Share this:
లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాల్లో గట్టి పట్టు ఉండేది. ఈశాన్య, దక్షిణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ దూసుకెళ్లేది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక, ఉత్తరాదిలో జోష్ తగ్గి... ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ దూసుకెళ్లింది. కానీ, దక్షిణ రాష్ట్రాల్లో అడ్డంగా ఫెయిలైంది. కర్ణాటకలో కాస్త మెరుగుపడినా, అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఫలితంగా ఉప ఎన్నికల్లో ఫెయిలైంది. అలాగని దక్షిణాదిన కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఉందా అంటే అదీ లేదు. ఇదివరకు దక్షిణాన దూసుకెళ్లిన కాంగ్రెస్ ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. ముఖ్యంగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు అధికారాన్ని ఏలిన కాంగ్రెస్, ఇప్పుడు అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఎక్కడా ప్రభావం చూపలేకపోతోంది. కానీ, ఢిల్లీలో పాగా వెయ్యాలంటే దక్షిణాది ప్రజల మనసులు గెలవాల్సిందేనని రెండు పార్టీలూ గుర్తించాయి.

కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలో మొత్తం 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలో ఉన్నవే. 2014లో ఇక్కడ బీజేపీ గెలిచింది 21 సీట్లు మాత్రమే. కర్ణాటకలో 17, ఏపీలో 2, తమిళనాడులో ఒకటి, తెలంగాణలో ఒకటి మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఈసారి మాత్రం కనీసం 50 సీట్లు సౌత్ నుంచే రావాలని కమలదళం డిసైడైంది. కాంగ్రెస్ విషయానికొస్తే, 2014లో దక్షిణ రాష్ట్రాల్లో దక్కినవి 19 సీట్లే. వాటిలోనూ కర్ణాటక నుంచే 10 గెలుచుకుంది. ఈసారి కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి ముందుకెళ్లాలని భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలని చూస్తోంది.


ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ దక్షిణాదిలో పట్టు కోసం తమ తమ కీలక నేతల్ని ఇక్కడ పోటీకి దింపాలని భావిస్తున్నాయి. అలా చేస్తే, కార్యకర్తల్లో జోష్ పెరిగి... పార్టీకి లాభం కలుగుతుందని అంచనా వేస్తున్నాయి. దక్షిణ బెంగళూరు లోక్ సభ స్థానం నుంచీ మోదీ పోటీ చెయ్యాలని కర్ణాటక బీజేపీ నేతలు కోరుతున్నారు. 1996లో అక్కడ బీజేపీ నేత అనంతకుమార్ వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఈమధ్య ఆయన చనిపోవడంతో కొత్త అభ్యర్థి కావాల్సి వచ్చింది. ఇందుకు మోదీ ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇక రాహుల్‌ని యూపీలోని అమేథీతోపాటూ... సౌత్‌లోని కర్ణాటక లేదా కేరళ నుంచీ పోటీ చేయించాలనే ఆలోచనలున్నాయి. ఎమర్జెన్సీ టైంలో 1978లో ఇందిరాగాంధీ... కర్ణాటకలోని చిక్‌మంగళూర్ నుంచీ పోటీ చేశారు. వెంటనే కాంగ్రెస్ బలపడింది. 1996లో సోనియాగాంధీ... కర్ణాటకలోని బళ్లారి నుంచీ పోటీ చేశారు. కాంగ్రెస్ మరోసారి బలపడింది. ఇప్పుడు రాహుల్ కూడా సౌత్ నుంచీ పోటీ చేస్తే కాంగ్రెస్ బలపడుతుందనే నమ్మకాలు నేతల్లో ఉన్నాయి.




తమిళనాడులో బీజేపీకి ఇదివరకు 1 స్థానమే దక్కింది. ఇప్పుడు అన్నాడీఎంకేతో కలిసి ముందుకెళ్తోంది. 9 చోట్ల పోటీ చేయబోతోంది. కాంగ్రెస్ మాత్రం ప్రతిపక్ష DMKతో కలిసింది. తెలంగాణ, ఏపీలో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగుతోంది. కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోరాటం చేయబోతున్నా, తెలంగాణలో తమకు టీడీపీ సహకరిస్తుందని భావిస్తోంది. అయినప్పటికీ... అది పెద్దగా కలిసొచ్చే అవకాశాలు లేవు.

 

ఇవి కూడా చదవండి :సైలెంట్‌గా విజృంభిస్తున్న టీబీ... క్షయ వ్యాధి లక్షణాలేంటి... రాకుండా ఏం చెయ్యాలి

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం
First published: March 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>