హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rahul Gandhi: రాహుల్ గాంధీ నిద్రించే కంటైనర్ ఇదే.. ఏమేం సదుపాయాలు ఉన్నాయో తెలుసా?

Rahul Gandhi: రాహుల్ గాంధీ నిద్రించే కంటైనర్ ఇదే.. ఏమేం సదుపాయాలు ఉన్నాయో తెలుసా?

Bharat Jodo Yatra: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు రోజుల యాత్ర పూర్తయింది. ఈ యాత్ర సందర్భంగా రాహుల్ అత్యాధునికి సదుపాయాలు ఉన్న కంటైనర్‌లో బస చేస్తున్నారు. వీటిలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కాంగ్రెస్​ (Congress) అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) భారత్​ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు రోజుల యాత్ర పూర్తయింది. ఈ యాత్ర సందర్భంగా రాహుల్ అత్యాధునికి సదుపాయాలు ఉన్న కంటైనర్‌లో బస చేస్తున్నారు. ఆ కంటైనర్‌లో ఉన్న సౌకర్యాలు ఏంటి? ఆయనతో ప్రయాణిస్తున్న పార్టీ సహచరులకు ఎలాంటి కంటైనర్స్‌, సదుపాయాలు అందించారు? వంటి విషయాలు తెలుసుకుందాం.

భారత్ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో 60 ట్రక్కు-మౌంటెడ్ కంటైనర్లు, 10-సీటర్ కాన్ఫరెన్స్ రూమ్ ఫెసిలిటీ, మొబైల్ టాయిలెట్లు, డైనింగ్ ఏరియా వంటి కనీస సౌకర్యాలు ఉన్నాయి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కి.మీ రాహుల్ నడవనుండగా.. ఆయనతో పాటు 119 మంది భారత్ యాత్రికులు (Bharat Yatris) నడుస్తారు. ఈ యాత్రలో సహాయక సిబ్బంది, క్యాంపులను మెయింటైన్ చేసే వ్యక్తులతో సహా మొత్తం దాదాపు 230 మంది పాల్గొంటారు. వీరందరూ యాత్ర సమయంలో ట్రక్కులపై అమర్చిన 60 కంటైనర్లలో గడుపుతారు. ప్లాన్ ప్రకారం కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు.

రాహుల్ గాంధీ కంటైనర్‌లో ఉండే సౌకర్యాలు

రాహుల్ గాంధీ ఉండే కంటైనర్‌లో ఒక చిన్న సోఫా, ఎయిర్ కండీషనర్, చిన్న ఫ్రిజ్, ఒక అటాచ్డ్ టాయిలెట్ ఉన్నాయి. మహాత్మా గాంధీ కవాతులు ప్రతిబింబించేలా ఒక ఫొటో రిప్రజెంటేషన్ కూడా ఈ వాహనంలో కనిపిస్తుంది. "ప్రపంచంలో చూడాలనుకునే మార్పుగా మీరే మారండి" అని గాంధీ పలికిన విలువైన మాటలను రాహుల్ కంటైనర్‌లో రాశారు. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు 2 బెడ్స్ ఉన్న కంటైనర్లలో బస చేస్తున్నారు.

జాతీయ పతాకానికి ఘోర అవమానం.. మసిగుడ్డలా ఉపయోగిస్తూ .. వీడియో వైరల్

 కంటైనర్ల ప్రత్యేకతలు ఇవే

రాహుల్ యాత్రలో భాగమైన ఈ కంటైనర్లను వాటి ఆక్యూపెంట్ కెపాసిటీ ఆధారంగా కలర్-కోడ్స్‌ వేశారు. యెల్లో కలర్‌ ఉన్నవి సింగిల్ బెడ్ కంటైనర్లు కాగా బ్లూ కలర్‌లో ఉన్నవి వాష్‌రూమ్‌తో రెండు బెడ్స్ ఉన్న కంటైనర్లు. ఇక ఎరుపు, ఆరెంజ్ కలర్ కంటైనర్లు బంక్ బెడ్స్‌, రైలు కంపార్ట్‌మెంట్స్‌ వంటి ఎక్స్‌పీరియన్స్ యాత్రికులకు ఆఫర్ చేస్తాయి. మహిళ యాత్రికుల కోసం అటాచ్డ్ బాత్‌రూమ్‌లతో పింక్ కంటైనర్లు కూడా ఉండటం విశేషం.

ఈ కంటైనర్లలో మద్యం సేవించడం, ధూమపానం చేయడం నిషిద్ధం. 4 బెడ్స్, 6 బెడ్స్, 8 బెడ్స్, 12 బెడ్స్ ఉన్న కంటైనర్లు కూడా ఉన్నాయి. కొన్నిటిలో బాత్రూమ్స్ అటాచ్ చేయగా, మరికొన్నిటిలో ఈ సదుపాయం అందించలేదు. ట్రక్కులపై ఉన్న కంటైనర్లలో మొబైల్ టాయిలెట్లు, షవర్లు కూడా అమర్చారు. క్యాంప్‌సైట్‌లో భోజనం చేయడానికి వీలుగా కూడా ఒక ఫెసిలిటీ ఉంటుంది. 10 మంది కూర్చునే కాన్ఫరెన్స్ రూమ్ కంటైనర్ సైతం ఇక్కడుంది. కాగా ఈ కంటైనర్లను చైనాలో తయారు చేయలేదని ఒక నేత తెలిపారు.

పాదయాత్ర వివరాలు

దాదాపు ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాదయాత్ర జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రెండు విడతలుగా పాదయాత్ర సాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రతిరోజూ 22-23 కి.మీ నడుస్తారు.

First published:

Tags: Bharat Jodo Yatra, Congress, Rahul Gandhi

ఉత్తమ కథలు