హార్దిక్ పటేల్‌కు గుజరాత్ పీసీసీలో కీలక బాధ్యతలు..

పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌ను గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. హార్దిక్ పటేల్‌ నియామకాన్ని తక్షణమే అమల్లోకి తీసుకునే ప్రతిపాదనను అధిష్టానం తక్షణమే ఆమోదించినట్లు గుజరాత్ పీసీసీ తెలిపింది.

news18-telugu
Updated: July 11, 2020, 11:29 PM IST
హార్దిక్ పటేల్‌కు గుజరాత్ పీసీసీలో కీలక బాధ్యతలు..
హార్ధిక్ పటేల్ (ఫైల్ ఫొటో)
  • Share this:
పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌ను గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. హార్దిక్ పటేల్‌ నియామకాన్ని తక్షణమే అమల్లోకి తీసుకునే ప్రతిపాదనను అధిష్టానం తక్షణమే ఆమోదించినట్లు గుజరాత్ పీసీసీ తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే సీ వేణుగోపాల్.. హార్దిక్ పటేల్ కు ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. గుజరాత్‌లో పాటిదార్ రిజర్వేషన్ ఆందోళనను ప్రారంభించి హార్దిక్ పటేల్ నాయకత్వం వహించాడు. పాటిదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని అతి చిన్న వయస్సులోనే ప్రజా ఉద్యమాల్లోకి ప్రవేశించిన హార్దిక్ పటేల్ కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. కేవలం 26 సంవత్సరాల వయస్సు ఉన్న హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం. అయితే దేశ ద్రోహం కేసుతో పాటు పలు కేసులను ఎదుర్కొంటున్న హార్దిక్ ను జనవరి 18 న అరెస్టు చేశారు. నాలుగు రోజుల తరువాత అతనికి బెయిల్ లభించింది. పటాన్, గాంధీనగర్ జిల్లాల్లో నమోదైన మరో రెండు కేసులకు సంబంధించి మళ్లీ అతడిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద గుజరాత్ అంతటా తనపై నమోదైన 20 కేసులను హార్దిక్ పటేల్ ఎదుర్కొంటున్నాడు.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 11:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading