CONG TO PICK PARTY CHIEF TOMORROW MALLIKARJUN KHARGE MUKUL WASNIK FRONT RUNNERS TO SUCCEED RAHUL SK
కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్..రేపే ప్రకటన..రేస్‌లో ఉన్నది వీళ్లే..
సోనియా, రాహుల్ గాంధీ
ఖర్గే, వాస్నిక్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు. అంతేకాదు గాంధీ ఫ్యామిలీకి వీరిద్దరు ఆప్తులు..అంతకు మించి అత్యంత నమ్మకస్తులు. అందుకే వీరిలో ఒకరిని పార్టీ ప్రెసిడెంట్ చేయాలని సోనియా,రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. అప్పటి నుంచీ ఆ పోస్టు ఖాళీగా ఉంది. నెల రోజులకు పైగా గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కొత్త బాస్ ఇంకా రాలేదు. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఐతే అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. ఈ క్రమంలో రాహుల్ తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారన్న దానిపై దేశరాజకీయాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ కేంద్రమంత్రులు మల్లిఖార్జున ఖర్గే, ముుకుల్ వాస్నిక్ అధ్యక్ష రేస్‌లో ముందున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరిలో ఒకరికి పార్టీ బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. శనివారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ ప్రెసిడెంట్‌పై అధికారిక ప్రకటన చేయనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష రేస్‌లో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ సుశీల్ షిండే, ఖర్గే, వాస్నిక్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఐతే వీరిలో ఖర్గే, వాస్నిక్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు. అంతేకాదు గాంధీ ఫ్యామిలీకి వీరిద్దరు ఆప్తులు..అంతకుమించి అత్యంత నమ్మకస్తులు. అందుకే వీరిలో ఒకరిని పార్టీ ప్రెసిడెంట్ చేయాలని సోనియా,రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనే పార్టీని నడిపించాలని ఎంతో మంది నేతలు నచ్చజెప్పినా..రాహుల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండనంటే ఉండనని ఖరాకండిగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోక తప్పడం లేదు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.