కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 400 కోట్ల రూపాయల హవాలా మనీ కేసులో విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఐటీ యాక్ట్ సెక్షన్ 131 కింద అహ్మద్ పటేల్‌కు ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ కాగా ఫిబ్రవరి 14న విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ ఆదేశించింది. అయితే, ఆరోగ్యం సరిగ్గా లేదని, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో ఐటీ శాఖ మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చింది .