చల్లని కబురు.. రుతుపవనాలపై ఐఎండీ ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

కేరళలో నైరుతి రుతుపవనాల ప్రారంభానికి జూన్ 1 నుంచి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని వివరించింది.

  • Share this:
    దేశవ్యాప్తగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. బయటకు వెళ్తే నిప్పులాకొలిమిలా ఎండలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో.. జనం అల్లాడుతున్నారు. ఐతే సూర్యతాపంతో ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) చల్లని కబురు చెప్పింది. జూన్ 1 తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుయు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. మే 31 నుంచి జూన్ 4 వరకు ఆగ్నేయం, పక్కనే ఉన్న తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో కేరళలో నైరుతి రుతుపవనాల ప్రారంభానికి జూన్ 1 నుంచి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని వివరించింది. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు మాల్దీవ్స్-కోమరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, అండమాన్, నికోబార్ దీవులను తాకుతాయని వెల్లడించింది.
    Published by:Shiva Kumar Addula
    First published: