హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Modi BBC row: ఇదేం పిటిషన్..? బీబీసీని బ్యాన్ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

Modi BBC row: ఇదేం పిటిషన్..? బీబీసీని బ్యాన్ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

Image/news24tvchannel

Image/news24tvchannel

Modi BBC row: బీబీసీపై భారత్‌లో నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హిందూ సేన వేసిన ఈ పిటిషన్‌ను సుప్రంకోర్టు కొట్టివేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గుజరాత్ అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే చాలామంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక తాజాగా ఈ మరో పిటిషన్‌ సుప్రీం ముందుకు వచ్చింది. 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి ప్రస్తావిస్తూ.. బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీబీసీపై భారత్‌లో నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హిందూ సేన వేసిన ఈ పిటిషన్‌ను సుప్రంకోర్టు కొట్టివేసింది.

పిటిషన్‌పై సుప్రీం అసహనం:

మోదీ ఇమేజ్‌ను టార్గెట్ చేయడానికే బీబీసీ ఈ డాక్యుమెంటరీ చేసిందని హిందూ సేన వాదించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే బీబీసీ ఇండియాకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని పిటిషన్‌లో ప్రస్తావించింది హిందూ సేన. ఇప్పటికే కేంద్రహోం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని హిందూసేన తెలిపింది. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుంద్రేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హిందూ సేనకు మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు ఇలాంటి సెన్సార్‌షిప్‌ను చేయలేదని తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే పిటిషన్ అని.. అసలు ఇలా ఎలా వాదిస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పూర్తిగా ఆ ఛానల్‌పై సెన్సార్‌ విధించాలా.? ఇదేం పిటిషన్‌ అంటూ పిటిషనర్ల వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కేంద్ర నిర్ణయంపై గతంలో సుప్రీంకోర్టు నోటీసులు:

బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి ఈ ఫిబ్రవరీ 3న సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో రూపొందించిన సిరీస్‌ను ప్రసారం చేయకుండా కేంద్రం అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని, మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఇటీవల రూపొందించిన డాక్యుమెంటరీ (BBC Documentary) దేశ విదేశాల్లో దుమారం రేపింది. ఈ డాక్యుమెంటరీని, దీనికి సంబంధించిన వీడియో లింకులను భారత్‌లో కేంద్రం బ్లాక్ చేసింది.

First published:

Tags: Supreme Court

ఉత్తమ కథలు