నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సాయంత్రంలోపు కీలక ప్రకటన

Maharashtra Politics : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా... అడుగులు పడుతున్నా... చర్చలు ఇంకా కొలిక్కి రావట్లేదు. మరోసారి శివసేనతో చర్చించేందుకు కాంగ్రెస్-ఎన్సీపీ సిద్ధమవుతున్నాయి. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

news18-telugu
Updated: November 22, 2019, 6:21 AM IST
నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సాయంత్రంలోపు కీలక ప్రకటన
నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సాయంత్రంలోపు కీలక ప్రకటన
  • Share this:
Maharashtra Politics : మహారాష్ట్రలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సీఎం అవుతారనీ, చర్చలు తేలిపోయాయనే ప్రచారం జరుగుతుంటే... కాంగ్రెస్ మాత్రం అంత సీన్ లేదంటోంది. మీడియా ఊహాగానాలే తప్ప ఇంకా విషయం ఫైనల్ కాలేదని చెబుతోంది. నిన్న ఢిల్లీలో NCP చీఫ్ శరద్ పవార్‌తో కాంగ్రెస్ నేతలు చాలా విషయాల్లో ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు. అందువల్ల ఇవాళ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేను కలిసి ఫైనల్ చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైతే... ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలుంటాయి. కాంగ్రెస్, ఎన్సీపీతోపాటూ... రైతు కార్మికుల పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, స్వాభిమాని పక్ష, సీపీఎం కూడా ఇవాళ శివసేన, ఎన్సీపీ చర్చలు జరపనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ కోర్ గ్రూప్ సభ్యులైన అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇవాళ మహారాష్ట్ర వెళ్లనున్నారు.

ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో మూడు పార్టీలకు 14-14-14 చొప్పున మంత్రి పదవులు ఉండాలని కాంగ్రెస్ చెప్పినట్టు తెలుస్తోంది. ఐతే... శివసేన హిందుత్వ అజెండాతో వెళ్తే మాత్రం తాము కటీఫ్ చెబుతామని కాంగ్రెస్ చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచీ మహారాష్ట్ర వచ్చిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో గురువారం రాత్రి ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే కలిశారు. శరద్ పవార్ ఇల్లు సిల్వర్ ఓక్‌లో ఈ భేటీ జరిగింది. ఇవాళ ఫైనల్ చర్చల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ఓ ప్రకటన చేస్తాయని తెలిసింది. ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌కు తమ అభిప్రాయం చెబుతూ... మూడు పార్టీలూ వేర్వేరు లేఖలు పంపనున్నాయి. ఇదే సమయంలో ఉద్ధవ్ థాక్రే తమ పార్టీ నేతలతో ఇవాళ ఓ మీటింగ్ పెట్టి... పార్టీ నిర్ణయాన్నీ, భవిష్యత్ కార్యాచరణనూ చెప్పనున్నారు.

 

Pics : బ్రైడల్ ఫొటోషూట్‌లో మెరిసిన జియా మానెక్


ఇవి కూడా చదవండి :

IND vs BAN | నేడే పింక్ బాల్ టెస్ట్... ఇవీ ప్రత్యేకతలు

Health : నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.


Health Tips : పియర్స్ తినండి... బరువు తగ్గండి... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : కొబ్బరి పాలతో హెయిర్ స్పా... ఇలా చెయ్యండి
First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>