ఇంటి రెంట్ కట్టకపోతే ఏం జరుగుతోంది..? సినిమాల్లో లాగే ఇంట్లో సామాన్లు బయటకు విసిరేస్తారు.. లేకపోతే ఏదో ఒక విలువైన వస్తువు పట్టుకుపోతారు.. లేకపోతే అద్దె చెల్లించాల్సిన వాళ్ల బైక్ లేదా ఇతర వాహనం ఏదైనా ఉంటే పట్టుకుపోతారు.. మరి మొబైల్ టవర్ రెంట్ కట్టకపోతే ఏం చేశారో తెలుసా..? ఇప్పుడు చాలా మంది ఇంటి డాబాలపై సెల్ టవర్లు కనిపిస్తూనే ఉంటాయి.. ఇలా బిల్డింగ్‌లపై మొబైల్ టవర్లు ఎప్పటినుంచో ఉండడం గమనిస్తూనే ఉన్నాం.. చెన్నైలోని కోయంబేడులోని ఓ బిల్డింగ్‌పై ఇలానే ఒకప్పుడు ఇలానే ఓ సెల్ టవర్ ఉండేది.. అయితే ఇప్పుడది లేదు.. ఎందుకంటే రెంట్ కట్టలేదు.. కట్టనందుకు ఆ బిల్డింగ్ ఓనర్ ఏం చేశాడో తెలుసా..?
జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ కోయంబేడులోని నార్త్ మాడా స్ట్రీట్‌లోని భవనం పైకప్పుపై 15 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. కంపెనీ 2006 నుంచి 2018 వరకు దాని యజమానులు చంద్రన్, కరుణాకరన్, బాలకృష్ణన్‌కు అద్దె చెల్లించింది. ఆ తర్వాత రెంట్ పే చేయ్యలేదు. ఈ టెలికాం కంపెనీ మార్చి 12, 2018 నుంచి కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. కొద్ది రోజుల క్రితం జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన కొందరు ఉద్యోగులు భవనాన్ని సందర్శించి మొబైల్ టవర్ కనిపించకపోవడాన్ని గుర్తించారు. ఆ తర్వాత టవర్ ఏమైందో తెలుసుకొని షాక్‌కు గురయ్యారు.
స్క్రాప్ కొట్టుకు అమ్మేశారు:
బిల్డింగ్‌పై ఉన్న టవర్ కనిపించకపోవడంతో ముందు షాక్‌కు గురైన కంపెనీ ఉద్యోగులు దీనిపై ఆరా తీశారు. టవర్ మిస్సింగ్ గురించి బిల్డింగ్ ఓనర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే వాళ్లు చెప్పిన సమాధానం విని షాక్‌య్యారు. ఐదేళ్లుగా తమకు అద్దె రాకపోవడంతో టవర్‌ను కూల్చివేసి కోయంబేడులోని స్క్రాప్ షాపునకు విక్రయించినట్లు యజమానులు చెప్పడంతో కంపెనీ ఉద్యోగులకు ఏం మాట్లాడాలో అర్థంకాలేదు. అక్రమంగా టవర్‌ను కూల్చివేసి విక్రయించిన భవన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన ఓ అధికారి కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టవర్ విలువ రూ.8.62 లక్షలు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. టవర్‌ను కూల్చెటప్పుడు తమకు మాటవరుసకైనా చెప్పలేదని కంప్లైంట్ చేశాడు. అయితే ఐదేళ్లు రెంట్ కట్టకపోతే ఏం చేయాలని ఓనర్లు తిరిగి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు సంవత్సరాలు కూడా కాదు అని.. ఏకంగా 5ఏళ్లు నుంచి రెంట్ కట్టకుండా ఉన్నారని విమర్శిస్తున్నారు. అయితే లీగల్‌గా ప్రొసిడ్ అవ్వాల్సిందని.. ఇలా చెప్పకుండా టవర్‌ను కూల్చడం.. స్క్రాప్ షాప్‌కు అమ్మడం కరెక్ట్ కాదని మరికొందరు వాదిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.