సామాన్యులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం.. ఢిల్లీ ఎన్నికల్లో ఈసీ సరికొత్త నిర్ణయం..

Postal Ballot : ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సామాన్యులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను వేదికగా ఎంచుకుంది.

news18-telugu
Updated: January 6, 2020, 8:36 PM IST
సామాన్యులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం.. ఢిల్లీ ఎన్నికల్లో ఈసీ సరికొత్త నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సామాన్యులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను వేదికగా ఎంచుకుంది. ఇప్పటి వరకు కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండగా, ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే.. ఆ అవకాశం దివ్యాంగులు, శారీరక సమస్యలతో బాధపడేవాళ్లు, అనివార్య కారణాలతో పోలింగ్ బూత్‌కు రాలేని వాళ్లకు, 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ అవకాశం కల్పిస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటు శాతం పెంచేందుకు, ఓటు వేయాలనుకొని రాలేకపోయిన వారికి ఇది సదవకాశం అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా తెలిపారు.

ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అరోడా వెల్లడించారు. దీనికి సంబంధించి జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు.

First published: January 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు