COMMODITIES RATES HIKE IN UTTARAKHAD SALT KG 130 VRY
Salt kg@ 130 : అక్కడ .. కిలో ఉప్పు రూ. 130, ఉల్లిగడ్డ 150 .. కారణం ఇదే... !
Salt kg@ 130 : అక్కడ .. కిలో ఉప్పు రూ. 130, ఉల్లిగడ్డ 150 .. కారణం ఇదే... !
Salt kg@ 130 : అది భారతదేశమే.. అయినా అక్కడ ఉప్పు కిలో 130 రూపాయలకు అమ్ముతున్నారు.. ఉప్పుతో పాటు ఉల్లిపాయలు సైతం కిలో 150 రుపాయలకు అమ్ముతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్వవసర వస్తువులు రేట్లు ఊహించని విధంగా పెరిగిపోయాయి.
సాధారణంగా నిత్యవసర ( Commodities rates )వస్తువుల్లో ఉప్పు, ఉల్లిపాయాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి..కాని వాటి ధరలు కొండప్రాంతాల్లో కొండెక్కాయి.. అక్కడి వాతవరణ పరిస్థితులతో వాటికి రెక్కలు వచ్చాయి. అయితే దేశంలో వాతవరణ పరిస్థితులు అనుకూలించని ప్రాంతాల్లో నిత్యవసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ నేపథ్యలోనే తాజాగా హిమాలయప్రాంతమైన ఉత్తరాఖండ్ (Uttarakhanad) రాష్ట్రంలోని పిథోరగఢ్ జిల్లాలో నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగాయి..ఈ క్రమంలోనే కేజీ ఉప్పును రూ.130 వరకు విక్రయిస్తున్నారు. వంటనూనె ధర రూ.275-300 మధ్య ఉంది. కేజీ ఎర్ర పప్పు ధర రూ.200, కేజీ బియ్యం రూ.150, ఉల్లిపాయ కిలో రూ.125, చక్కెర, గోధుమ పిండి కేజీ రూ.150కి చేరింది. ధరలు సాధారణం కంటే 8 రెట్లు ఎక్కువ కావడం వల్ల స్థానిక ప్రజలు చుక్కలు చూస్తున్నారు.
ముఖ్యంగా ఇందుకు కారణం ఆయా జిల్లాలకు వెళ్లె గ్రామాల దారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు (rains) పాడై పోవడంతో పాటు ఘాట్రోడ్లు కావడంతో రవాణ సౌకర్యాలకు కష్టంగా మారింది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లె నిత్యవసరం ధరలకు కూడా రెక్కలు వచ్చాయి..
దీంతో స్థానిక ప్రజలు అధిక ధరలు భరించలేరని వారిని ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆదుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని కోరుతున్నారు. దీంతో ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు స్థానిక అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. మరోవైపు సరుకులు బ్లాక్లో విక్రయిస్తున్నవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా వేసవి కాలంలో వీరంతా వ్యవసాయం, పశువుల సంరక్షణ కోసం కొండపైకి వెళ్లి 6 నెలల పాటు అక్కడే ఉంటారు. శీతాకాలంలో హిమపాతం బారిన పడకుండా ఉండేందుకు కిందకు వస్తారు. అయితే వర్షాల కారణంగా ఇక్కడి రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు, సరకులు సరఫరా చేసేందుకు రవాణా సౌకర్యం లేక ధరలు భారీగా పెరిగాయి.ప్రభుత్వ అధికారులు వీలైనంత త్వరగా తమ సమస్యలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేకపోతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.