COMING SOON BIG SHOCK TO COMMON MAN BECAUSE ALL HOME APPLIANCE PRICE HIKE NGS
Home Appliances: మధ్యతరగతి ప్రజలకు ఊహించని షాక్.. త్వరలో ప్రియం కానున్న గృహోపకరణాలు!
Home Appliances
Home Appliances: మధ్యతరగతి వారి బతుకులు భారమవుతున్నాయి. కరోనా, లాక్ డౌన్ పరిస్థితులు కారణంగా జాబ్ లు పోయి.. జీతాల్లో కోత పడడంతో రెండుపూటలా సరైనా ఆహారం లేక కొందరు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు పెరిగిన ధనలతో లబోదిబో అంటున్నారు. అయితే తాజాగా మధ్య ధరగతి ప్రజలకు ఊహించని షాక్ తగలబోతోంది.
Home Appliances: లీటర్ పెట్రోల్ ధర ఎప్పుడో వంద దాటింది. ఇప్పుడు కూరగాయల ధరలు సైతం ఆకాశాన్ని అన్నింటున్నాయి. సామాన్యుడికి అవసరం అనుకునే అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. పెరిగిన నిత్యావసర ధరలతో ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు అన్నంత దారుణంగా పరిస్థితి మారింది. పాల నుంచి ఫ్యాన్ వరకు అన్ని ధరలు పెరగడం.. ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో చాలామంది మద్యతరగతి వారు పేదవారుగామారుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి మరో షాక్ తగలబోతోంది. ఈ రోజుల్లో నిత్యావసరాలుగా మారిన టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాల వస్తువుల రేట్లు అమాంతంక పెరగనున్నట్టు సమాచారం. కార్లు, బైక్లు వంటి వాహనాల ధరలు కూడా సామాన్యునికి అందకుండా పోతున్నాయి. వచ్చే మూడునెలల్లో నాలుగు నుంచి 10శాతం రేట్లు పెంచుతామని ఆయా కంపెనీలే ప్రకటిస్తున్నాయి.
ఇక రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల ధరలను కంపెనీలు ఇప్పటికే 3 నుంచి 5శాతం పెంచాశాయి. ఇక వచ్చే నెల నుంచి 6 నుంచి 10 శాతం వాటి ధరలను పెంచేందుకు కంపెనీుల సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో గృహోపకరణాల ధరలు రెండు, మూడు సార్లు పెరిగాయి. ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ధరలు, సరఫరాల్లో ఆటంకం వంటివి ధరల పెరుగుదలకు కారణాలని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.
స్టీల్, రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటివాటి ధరలు 22 నుంచి 23శాతం పెరిగాయి. ఉత్పత్తికి, సరఫరాకు అవుతున్న వ్యయాన్ని త్వరలోన రాం బ ప్రభుత్వ ట్నవ మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, స్కోడా, వ్యాక్స్ వాగన్.. ఇలా దాదాపు అన్ని కంపెనీలు ఏడాదిలో అనేకమార్లు ధరలు పెంచాయి. కొత్త సంవత్సరంలో ధరలు మళ్లీ పెంచుతామని ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. దీంతో సామాన్యుడి బతుకు మరింత భారం కానుంది. ఇప్పటికే రేట్లు ఊహించని స్థాయి లో పెరిగి కూర్చున్నాయి. ఉప్పు, పప్పు. పాలు, నీళ్లు అని తేడా లేకుండా అన్ని ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి.
ఒకప్పుడు 100 రూపాయలకు వారం సరిపిడ కూరగాయలు కొనే పరిస్థితి ఉండేది.. ఇప్పుడు 100కి కేవలం ఒక కూరగాయాలు మాత్రమే కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇవన్నీ నిత్యావసరాలే.. రేట్లు పెరిగిన తప్పక కొనాల్సి వస్తోంది. అయితే రేట్లు పెరుగుతున్నాయి. కానీ సామాన్యుడి ఆదాయం పెరదడం లేదు. వివిధ కారణాలతో తగ్గుతూ వస్తోంది. కరోనా , లాక్ డౌన్ లతో సగం మంది ఆదాయం పడిపోయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెరగడం తప్ప తగ్గే అవకాశం లేదు. తాజాగా మరోషాక్ ఇస్తున్నాయి కంపెనీలు.. మద్యతరగతి ప్రజలకు నిత్యావసరంగా మారిని చాలా వాటి ధరలు త్వరలోనే పెరగనున్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.