విద్యాసంస్థలు తెరుచుకోవడంపై యూజీసీ కీలక నిర్ణయం..

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆటోమెటిక్‌గా పైతరగతులకు ప్రమోట్ చేశారు. డిగ్రీ, పీజీ, బీటెక్ వంటి పరీక్షలపై ఇంకా సందిగ్ధత తొలగలేదు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు.

news18-telugu
Updated: July 5, 2020, 7:15 AM IST
విద్యాసంస్థలు తెరుచుకోవడంపై యూజీసీ కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ రోజురోజూకీ విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ వల్ల దాదాపు అన్నిరంగాలపై ప్రభావం పడింది. ప్రధానంగా విద్యా సంవత్సరానికి కీలకంగా ఉండే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్ విధించడం.. అది ఇంకా కొనసాగుతుండడంతో విద్యార్థులు భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా తయారయ్యింది. ఇప్పటికే గత విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఒక్క ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రమే సజావుగా సాగాయి. పదో తరగతి పరీక్షలు జరగడం కష్టం కావడంతో ఆయా రాష్ట్రాలు విద్యా సంవత్సరంలో అప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను పాస్ చేశారు.

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆటోమెటిక్‌గా పైతరగతులకు ప్రమోట్ చేశారు. డిగ్రీ, పీజీ, బీటెక్ వంటి పరీక్షలపై ఇంకా సందిగ్ధత తొలగలేదు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజూకీ ఎక్కువ అవుతుండడంతో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటినీ ఈనెల 31 వరకు బంద్ చేయాలని యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.

దేశంలోని యూనివర్సిటీలు,కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీలు, లైబ్రరీలను ఈనెల 31 వరకు బంద్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆదేశించింది.
Published by: Narsimha Badhini
First published: July 5, 2020, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading