బాలిక కడుపులో అర కిలో జుట్టు.. షాంపూ ప్యాకెట్లు..

కోయంబత్తూర్‌లోని ఓ హాస్పిటల్‌లో ఓ బాలిక కడుపులోంచి అర్ధ కిలో జుట్టును, ఖాళీ షాంపూ ప్యాకెట్లను తీశారు వైద్యులు.

news18-telugu
Updated: January 28, 2020, 7:58 PM IST
బాలిక కడుపులో అర కిలో జుట్టు.. షాంపూ ప్యాకెట్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోయంబత్తూర్‌లోని ఓ హాస్పిటల్‌లో ఓ బాలిక కడుపులోంచి అర్ధ కిలో జుట్టును, ఖాళీ షాంపూ ప్యాకెట్లను తీశారు వైద్యులు. ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక నిరంతరం కడుపునొప్పితో బాధపడటంతో ఏమైందోనని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, స్కాన్ చేసి చూసి విస్తుపోయారు. బాల్ లాంటి వస్తువేదో ఆమె కడుపులో ఉందని, దాన్ని తొలగించాలని బాలిక తల్లిదండ్రులకు స్పష్టం చేశారు. ముందుగా ఎండోస్కోపీ ద్వారా దాన్ని తీయాలని చూసినా, ఫలితం లేకపోయింది. దీంతో ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపరేషన్ చేయగా ఆమె కడుపులోంచి వెంట్రుకలు, షాంపూ ప్యాకెట్లు బయటపడ్డాయి.

వాస్తవానికి బాలిక దగ్గరి బంధువులు చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిందని, తర్వాత ఆమె ఏం చేస్తుందో తెలీకుండా వాటిని తినేసిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం సాధారణ స్థితిలోనే ఉందని స్పష్టం చేశారు.


First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు