• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COBRA ALONG WITH 28 SNAKELETS 36 EGGS RESCUED IN BALASORE BN

భారీగా బయటపడ్డ పాములు.. 28 కోబ్రా పిల్లలతో పాటు 36 గుడ్లు..

భారీగా బయటపడ్డ పాములు.. 28 కోబ్రా పిల్లలతో పాటు 36 గుడ్లు..

ప్రతీకాత్మక చిత్రం

స్థానికులు భద్రాక్ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న హెల్ప్ లైన్ సభ్యుడు మీర్జా 28 కోబ్రా పిల్లలతో పాటు 36 పాము గుడ్లను సురక్షితంగా రక్షించారు.

  • Share this:
    ఒక్కటీ రెండు కాదు.. 28 కోబ్రా పిల్లలు.. 36 పాము గుడ్లు బయటపడడంతో ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలో కలకలం రేగింది. అసలే వర్షాకాలం.. ఈ కాలంలో పాముల సంచారం అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో పాముల వృద్ధి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకే చోట 28 కోబ్రా పాము పిల్లలతో పాటు 36 పాము గుడ్లు దొరకడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బాలాసోర్ జిల్లాలో ఒక ప్రాంతంలో 28 కోబ్రా పాము పిల్లలతో పాటు 36 గుడ్లను వెలుగు చూశాయి. దీంతో భయాందోళన చెందిన స్థానికులు భద్రాక్ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న హెల్ప్ లైన్ సభ్యుడు మీర్జా 28 కోబ్రా పిల్లలతో పాటు 36 పాము గుడ్లను సురక్షితంగా రక్షించారు. వాటిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఇదిలావుంటే.. వర్షాకాలంలో ఇంత భారీ స్థాయిలో పాము పిల్లలు బయటపడుతుండడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఒకచోట భారీ స్థాయిలో పాములు బయటపడుతుండడం కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
    Published by:Narsimha Badhini
    First published: