Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జార్ఖండ్ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన దోషిగా తేల్చిన సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది.

news18-telugu
Updated: October 26, 2020, 1:18 PM IST
Coal Scam: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష
దిలీప్ రే(ఫైల్ ఫొటో)
  • Share this:
మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జార్ఖండ్ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన దోషిగా తేల్చిన సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి అక్టోబర్ 6న దిలీప్ రేను దోషిగా తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు శిక్షను ఖరారు చేసింది. దిలీప్‌తో పాటు అడిషనల్ కోల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ బెనర్జీ, కోల్ మినిస్ట్రీ అడ్వైజర్(ప్రాజెక్ట్స్) నిత్యానంద్ గౌతమ్‌లను కూడా కోర్టు దోషులకు తేల్చింది. వారికి కూడా దిలీప్ రేతో పాటుగా మూడేళ్ల జైలు శిక్ష విధించింది

అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రభుత్వంలో దీలీప్‌ రే బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. జార్ఖండ్‌లో బొగ్గు కేటాయింపుల్లో అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్‌ను 1999లో నిబంధనలకు విరుద్ధంగా సీటీఎల్‌కు కేటాయించారని వార్తలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు.. నిబంధనలను ఉల్లంఘించి సీటీఎల్‌కు బొగ్గు మైనింగ్‌ ప్రాంతాన్ని కేటాయించడాన్ని తప్పుబట్టింది. ఆ సయయంలో అధికారులు ఉన్న ప్రదీప్ కుమార్, నిత్యనంద్ గౌతమ్‌లు కూడా తప్పుగా వ్యవహరించారని పేర్కొంది.
Published by: Sumanth Kanukula
First published: October 26, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading