CNN-News18 No.1: నెంబర్ 1 స్థానాన్ని నిలుపుకొన్న ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్-న్యూస్18

CNN-News18 No.1: నెంబర్ 1 స్థానాన్ని నిలుపుకొన్న ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్-న్యూస్18

CNN-News18 No.1 | సీఎన్ఎన్-న్యూస్18 ఛానెల్‌కు ప్రధాన పోటీదారైన రిపబ్లిక్ టీవీ 27.5% మార్కెట్‌ షేర్‌తో ఏకంగా 12% వెనకబడగా, టైమ్స్ నౌ (18.6%) చాలా వెనుకంజలో ఉంది. సీఎన్ఎన్-న్యూస్18 సాధించిన మార్కెట్ షేర్‌లో టైమ్స్ నౌ సగం కూడా దక్కించుకోలేకపోయింది.

 • Share this:
  ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌గా నెంబర్ 1 స్థానాన్ని మరోసారి నిలుపుకొంది సీఎన్ఎన్-న్యూస్18. ఆల్ ఇండియా బార్క్ తాజా డేటా చూస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి నుంచి పట్టణాల వరకు ప్రతీ మెట్రిక్‌లో సీఎన్ఎన్-న్యూస్18 ఆధిపత్యం కనిపించింది. నెట్‌వర్క్18 గ్రూప్ ఫ్లాగ్‌షిప్ ఇంగ్లీష్ టీవీ ఛానెల్ అయిన సీఎన్ఎన్-న్యూస్18... ఏకంగా 39.2% మార్కెట్ షేర్‌తో(Week 22, NCCS All 2+, all days, all India) వ్యూయర్‌షిప్ రికార్డులను కొల్లగొట్టింది. అర్బన్ మార్కెట్ నుంచి ఆరు మెట్రోల వరకు కీలకమైన టార్గెట్ గ్రూప్ AB Male 22+ విభాగంతో పాటు ప్రతీ వ్యూయర్‌షిప్ కేటగిరీలో పైచేయి సాధించింది CNN-News18. ఇక సీఎన్ఎన్-న్యూస్18 ఛానెల్‌కు ప్రధాన పోటీదారైన రిపబ్లిక్ టీవీ 27.5% మార్కెట్‌ షేర్‌తో ఏకంగా 12% వెనకబడగా, టైమ్స్ నౌ (18.6%) చాలా వెనుకంజలో ఉంది. సీఎన్ఎన్-న్యూస్18 సాధించిన మార్కెట్ షేర్‌లో టైమ్స్ నౌ సగం కూడా దక్కించుకోలేకపోయింది. టైమ్స్ నౌ, ఇండియా టుడే మార్కెట్ షేర్‌ను కలిపినా సీఎన్ఎన్-న్యూస్18 ఛానెల్‌కు వచ్చిన 39.2% షేర్ రాలేదు.


  లోక్‌సభ ఎన్నికల సీజన్‌లో రెండో దశ నుంచి ఏడో దశ వరకు, ముఖ్యంగా కౌంటింగ్ రోజున సీఎన్ఎన్-న్యూస్18 వ్యూయర్‌షిప్ దూసుకెళ్లడం విశేషం. మే 23న ఫలితాల రోజున ఉదయం కౌంటింగ్ దగ్గర్నుంచి సాయంత్రం ప్రైమ్ టైమ్ వరకు CNN-News18 పూర్తిగా ఆధిపత్యం చూపించింది. ఎన్నికల ఫలితాలు, లేటెస్ట్ ట్రెండ్స్, కీలక పరిణామాలను ప్రత్యేక కవరేజీతో వినూత్నంగా అందిస్తూ CNN-News18, News18.com వీక్షకులకు, పాఠకులను ఆకట్టుకోవడం విశేషం. దేశంలోని ప్రతీ కౌంటింగ్ సెంటర్‌ను కవర్ చేస్తూ ఎన్నికల కవరేజీని వేగం, అత్యంత విశ్వసనీయంగా అందించిన న్యూస్ గ్రూప్ దేశంలో Network18 ఒక్కటే. ప్రతీ కౌంటింగ్ సెంటర్ దగ్గర్నుంచి లైవ్ ఇన్‌పుట్స్ తీసుకుంటూ వాటిని రియల్ టైమ్‌లో ప్రాసెస్ చేస్తూ, కోట్లాది మందికి టీవీలతో పాటు మొబైల్ స్క్రీన్స్‌పై అందించేందుకు హైదరాబాద్‌లో ఎలక్షన్ హబ్ ఏర్పాటు చేసింది Network18.  ప్రోగ్రామింగ్‌లో సరికొత్త ఆవిష్కరణల్ని అందించే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నికల కవరేజీ కోసం ‘Magic Wall’ ఏర్పాటు చేసింది CNN-News18. ఎన్నికల కవరేజీ, ఫలితాల ప్రజెంటేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే అనలిటికల్ టూల్ ఇది. అవార్డులు సొంతం చేసుకున్న రిపోర్టర్లు, ఎడిటర్ల బృందం నియోజకవర్గ స్థాయిలో జరిపిన పరిశోధన సాయంతో ఈ టూల్ కచ్చితమైన డేటాను అందించింది. అంతేకాదు గత ఎన్నికల ఫలితాలు, గెలిచిన, ఓడిన అభ్యర్థులు, మార్జిన్‌లో తేడాలు, జెయింట్-కిల్లర్స్, ఎన్నికల్లో ఓటింగ్ శాతాల సాయంతో తులనాత్మక విశ్లేషణ అందించడం సాధ్యమైంది. సరికొత్త టెక్నాలజీ, సృజనాత్మక కలయికతో ఆగ్యుమెంటెడ్, వర్చువల్ రియాల్టీ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నికల కవరేజీ అందర్నీ ఆకట్టుకునేలా సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది సీఎన్ఎన్-న్యూస్18.

  Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


  ఇవి కూడా చదవండి:

  Cricket Score: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై లైవ్ క్రికెట్ స్కోర్... గూగుల్ స్పెషల్ ఫీచర్ ఇలా వాడుకోండి

  Jan-Dhan Account: రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్, రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్... జన్ ధన్ ఖాతాతో లాభాలెన్నో

  EPFO: రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? ఇలా కలిపేయండి
  First published: