'సీఎన్ఎన్ న్యూస్ 18 (CNN-NEWS18) మరోసారి నెంబర్ వన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌గా నిలిచింది. తమకు ప్రధాన పోటీదారులుగా ఉన్న టైమ్స్ నౌ, రిపబ్లిక్ ఛానెళ్లను అధిగమించి దేశంలోనే నెంబర్ వన్ ఛానెల్‌గా అవతరించింది. అంతేకాదు 40% వీక్షకులతో ప్రైమ్ టైమ్‌లో తమకెవరూ పాటిలేరని నిరూపించింది. BARC డేటా (14-17'2022 వారం) ప్రకారం.. భారతదేశంలోని అర్బన్ + రూరల్ (AB15+ సెగ్మెంట్)లో 26.3% మార్కెట్ వాటాను CNN-News18 సాధించింది. ఇక ప్రైమ్ టైమ్ విభాగంలో దుమ్మురేపింది. ప్రైమ్-టైమ్ సెగ్మెంట్ (2+ [సోమ-శుక్రవారం] 1800-2300 గంటలు)లో ఏకంగా 40.2 శాతం వీక్షకులతో అదరగొట్టింది. రిపబ్లిక్ టీవీ 25శాతం, టైమ్స్ నౌ 20.2శాతానికే పరిమితమయ్యాయి.
ప్రేక్షకకులు అరుపులు కేకల కంటే.. వాస్తవిక వార్తలనే ఎక్కువగా ఆదరిస్తారని BARC రేటింగ్‌లో CNN-News18 నెంబర్ వన్‌గా నిలవడం ద్వారా మరోసారి నిరూపితమైంది. CNN-NEWS18 నిష్పాక్షికమైన రిపోర్టింగ్, అన్ని దృక్కోణాల్లో వార్తల కవరేజీతో మొత్తం ప్రసార రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందివ్వడంతో పాటు మెరుగైన ప్రోగ్రామింగ్ ప్రసారాల వల్ల ఛానెల్ వ్యూయర్‌షిప్ క్రమంగా పెరిగింది.
బార్క్ రేటింగ్ (WK 14-17'22)
మార్కెట్ షేర్ - ఆల్ ఇండియా - అర్బన్+రూరల్ (AB 15+)
1. CNN న్యూస్18 - 26.30%
2. టైమ్స్ నౌ - 25.60%
3. రిపబ్లిక్ టీవీ - 25.40%
4. ఇండియా టుడే - 12.40%
సీఎన్ఎన్ న్యూస్18 నెంబర్ వన్ ఇంగ్లీష్ ఛానెల్‌గా నిలిచినందుకు CNN-News18 మేనేజింగ్ ఎడిటర్ జక్కా జేకబ్ ( Zacca Jacob) హర్షం వ్యక్తం చేశారు. CNN News18 ప్రోగ్రామింగ్, తమ జర్నలిజంపై అపారమైన విశ్వాసాన్ని చూపిన వీక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ''వార్తలను ప్రజలకు అందించే సమయంలో బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. మేం క్లాసీగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఈ సిద్ధాంతాన్నే మేం నమ్ముకున్నాం. మా కథనాలు, ప్రోగ్రామింగ్ ఫార్మట్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది. CNN-News18 దేశంలోనే అత్యంత యంగ్ న్యూస్‌రూమ్. తాము ఒక కొత్త, యువ భారతదేశానికి ప్రతిబింబంగా నిలుస్తున్నామని చెప్పుకోవడానికి వెనకాడం.'' అని జక్కా జేకబ్ పేర్కొన్నారు.
నెట్‌వర్క్ 18 గ్రూప్ బిజినెస్ న్యూస్ సీఈఓ స్మృతి మెహ్రా మాట్లాడుతూ.. '' ఎలాంటి అత్యుత్సాహం ప్రదర్శించకుండా.. హేతుబద్ధమైన , ఆలోచింపజేసే వార్తలను తీసుకురావాలన్న సిద్ధాంతం వల్లే మా ఛానెల్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. స్ఫూర్తిదాయకమైన కథనాలను అందించే 'బిట్స్ టు బిలియన్ - ది యునికార్న్ స్టోరీ' వంటి అనేక కొత్త షోలను ప్రారంభించాం. కఠినమైన వాస్తవాలను బయటకు తీసుకొచ్చే 'ప్లెయిన్ స్పీక్'తో పాటు అద్భుతమైన ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే 'ఎ బిలియన్ న్యూ ఐడియాస్' వంటి కార్యక్రమాలు మా ఛానెల్‌ను నెంబర్ 1 స్థానం నిలిపేందుకు దోహదపడ్డాయి.'' అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CNN-NEWS18, Network18, News18