Home /News /national /

CNG AND PNG PRICES HIKED IN DELHI OTHER CITIES IGL REVISED GAS PRICE SECOND TIME IN OCTOBER MKS

gas prices: మళ్లీ పెరిగాయ్, 10రోజుల్లో ఇది రెండోసారి -Delhi NCR పరిధిలో CNG,PNG కొత్త ధరలు ఇవే

CNG, PNG ధరల పెంపు

CNG, PNG ధరల పెంపు

CNG and PNG prices hiked in Delhi : దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని ఆనుకుని ఉండే గురుగ్రామ్, నోయిడా తదితర సిటీల్లో గ్యాస్ సరఫరాలో అగ్రగామిగా ఉన్న ప్రైవేటు సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ పది రోజుల వ్యవధిలో రెండోసారి CNG,PNG ధరల్ని పెంచేసింది. వివరాలివి..

ఇంకా చదవండి ...
దసరా పండుగ సీజన్ లో గ్యాస్ కు ఏర్పడిన డిమాండ్ ను ప్రైవేటు కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. పది రోజుల వ్యవధిలోనే రెండోసారి గృహ, రవాణాకు వాడే గ్యాస్ ధరలను పెంచేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల నగరాల్లో వాహనాల్లో నింపే CNG (Compressed natural gas) ధరతోపాటు పైపుల ద్వారా గృహాలకు చేరే గ్యాస్ PNG(Piped Natural gas) రేటు భారం ఇంకొంత పెరిగింది. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామిగా ఉంటూ, దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల మెట్రోల్లో మెజార్టీ వాటాదారైన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(IGL) ఈ మేరకు కీలక ప్రకటన చేసింది..

దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు నగరాల్లో CNG (Compressed natural gas), PNG (Piped Cooking Gas) ధరలు పెంచామని, బుధవారం (అక్టోబర్ 13) ఉదయం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని IGL తెలిపింది. CNGపై ఒక కిలోకు రూ .2.28 , PNGపై క్యూబిక్ మీటరుకు రూ.2.10 పెంచారు.

సవరణ తర్వాత ఢిల్లీలో CNG గ్యాస్ ధర కిలోకు 49.76లు ఉంది. నోయిడాలో కిలో రూ.56.02, గురుగ్రామ్‌లో రూ.58.20, రేవారి రూ.58.90, కైతల్ రూ.57.10, ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీ రూ.63.28, ఫతేపూర్, హమీర్‌పూర్ రూ.66.54, అజ్మీర్, పాలి, రాజసమంద్ కిలోకు రూ. 65.02గా ఉంది.

పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ PNG ధరను క్యూబిక్ మీటరుపై రూ.2.10 పెరిగింది. చివరిసారిగా అక్టోబర్ 2న సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెంచారు. మళ్లీ పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెంచడం గమనార్హం. 2012 తర్వాత సీఎన్జీ ధరలలో ఇదే అత్యధిక పెరుగుదల.
Published by:Madhu Kota
First published:

Tags: Fuel prices, Gas

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు