Home /News /national /

CMRL ISSUED NOTICE TO ACTOR KAMAL HAASAN OWNED RAAJ KAMAL FILMS OFFICE PVN

Kamal Haasan : కమల్ హాసన్ కు షాక్..రాజ్ కమల్ ఫిల్మ్స్ ఆఫీసుకి నోటీసు

Kamal Haasan Photo : Twitter

Kamal Haasan Photo : Twitter

CMRL Notice To Kamal Haasan Office : లోక నాయకుడుగా పేరుపొందిన ప్రముఖ సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ చెన్నై మెట్రో రైల్ లిమిటైడ్(CMRL)నోటీసు పంపింది.

  CMRL Notice To Kamal Haasan Office : లోక నాయకుడుగా పేరుపొందిన ప్రముఖ సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్(Kamal Haasan) కి చెన్నై మెట్రో రైల్ లిమిటైడ్(CMRL)నోటీసు పంపింది. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) ఫేజ్ II ప్రాజెక్ట్ లో భాగంగా కావాల్సిన స్థల సేకరణలో సీఎంఆర్‌ఎల్‌ దృష్టిసారించింది. ఇందులోభాగంగా భారతి దాసన్ రోడ్‌లోని కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌(Raj Kamal Films International) ఆఫీసుకి చెందిన చోటులో 600 చదరపు అడుగుల స్థలం కావాల్సి వచ్చింది. దీంతో ఆ స్థలం కమల్ తమకు కేటాయించాలని కోరుతూ హాసన్ యాజమాన్యంలోని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌కు సీఎంఆర్ఎల్ నోటీసు జారీ చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్ట్ లో భాగంగా ఒక స్టేషన్‌ను నిర్మించడానికి CMRLకి దాదాపు 600 చదరపు అడుగుల స్థలం కావాలి. ఫేజ్ II ప్రాజెక్ట్‌లో నిర్మించబడే 120 స్టేషన్లలో ఒకటి భారతి దాసన్ రోడ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కమల్ హాసన్ కు చెందిన ఆఫీసు స్థలం అయితేనే మెట్రో స్టేషన్ నిర్మించడానికి అనువైన ప్రదేశంగా గుర్తించిన నేపథ్యంలో అతని కార్యాలయం ఉన్న స్థలంలో కొంత భాగం మాకు అవసరం. దీంతో భూసేకరణకు నోటీసులు జారీ చేశాం అని ఓ అధికారి తెలిపారు.

  కాగా, రూ. 61,843 కోట్లతో చెన్నై నగరంలో చేపట్టిన రెండో దశ మెట్రో ప్రాజెక్టులో భాగంగా లైట్‌హౌస్‌ నుంచి పూనమల్లి వరకు మెట్రో మార్గాన్ని కొంత భూగర్భంలోనూ, మరికొంత పిల్లర్లపై నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

  Travel Tips For Girls : అమ్మాయిలు వెళ్లేందుకు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే

  భారతి దాసన్ సలై వద్ద ప్రతిపాదిత భూగర్భ స్టేషన్ ఫేజ్ II ప్రాజెక్ట్‌ లో ఒక భాగం. నగరంలో మాధవరం, లైట్‌హౌస్, పురసవల్కం, గ్రీన్‌వేస్ రోడ్, పూనమల్లి, పోరూర్, వడపళని, ఆర్కాట్ రోడ్, మేదవాక్కం, అడయార్ వంటి అనేక ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. 2025 నాటికి పూనమల్లి-పవర్‌ హౌస్‌ లైన్‌ ప్రాజెక్ట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాన్నారు.  Heath And Fitness Tips : వర్షాకాలంంలో ఆరోగ్యంగా,ఫిట్ నెస్ తో ఉండాలంటే ఇలా చేయండి

  మరోవైపు,లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో ప్రధాన కథానాయకుడిగా కమల్ హాసన్ నటించి ఇటీవల విడుదలైన విక్రమ్ ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఘన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కమల్‌హాసన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇక తాజాగా విక్రమ్ సినిమాను చూసిన మహేష్.. ట్విట్టర్ వేదికగా తన రెస్పాన్స్‌ను పంచుకున్నారు.  అయితే తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, కమల్‌హాసన్‌ (Kamal hassan) ‘విక్రమ్‌’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తనకు ఎంతో నచ్చిందని.. కమల్ హాసన్ ఫ్యాన్ అయ్యినందుకు గర్వంగా ఉందన్నారు. దీనికి సంబంధించి మహేష్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. . ‘‘విక్రమ్‌’ న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. లోకేశ్‌ కనగరాజ్‌.. నేను మిమ్మల్ని కలిసి, విక్రమ్‌ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది.. ఎలా తెరకెక్కించారు అన్ని తెలుసుకుంటాను. సినిమా మైండ్‌ బ్లోయింగ్‌ అంతే. ఇక లెజెండరీ యాక్టర్‌ కమల్‌హాసన్‌ గారి నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు నా అనుభవం సరిపోదు కూడా. నేను ఆయనకు పెద్ద అభిమానిని.. చాలా గర్వంగా ఉంది. ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ఇరగదీశారు. అనిరుధ్‌ తన మ్యూజిక్‌తో మైమరిపించారు"అని మహేష్ బాబు తన ట్వీట్ లో పేర్కోన్నారు.
  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Chennai, Kamal haasan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు