CMIE SURVEY REPORT AT LEAST 5 46 MILLION INDIANS LOST JOBS IN OCTOBER KNOW DETAILS EVK
CMIE Survey: అక్టోబర్లో 54.6 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.. సీఎమ్ఐఈ సర్వే
ప్రతీకాత్మక చిత్రం
CMIE Survey : సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (Centre for Monitoring Indian Economy) తాజా సర్వే కొన్ని చేదు నిజాలను బయటపెట్టింది. ఈ సంస్థ సర్వే వివరాల ప్రకారం దేశంలో అక్టోబర్ నెలలోనే 5.46 మిలియన్ల భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించింది.
కరోనా (Corona) తరువాత మార్కెట్ బాగా పుంజుకుంది అని పలువురు చెబుతున్నా.. దేశీయంగా కొన్ని రంగాలపై కరోనా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology), రిటైల్ ట్రేడ్ మరియు ఎడ్యుకేషన్ సెక్టార్ ఉద్యోగాలు క్షీణించాయి. నిపుణులకు పెద్దపీట వేస్తున్నా.. ఉద్యోగాల్లో కోత తప్పడం లేదు. తాజాగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (Centre for Monitoring Indian Economy) తాజా సర్వే కొన్ని చేదు నిజాలను బయటపెట్టింది. ఈ సంస్థ సర్వే వివరాల ప్రకారం అక్టోబర్ నెలలోనే 5.46 మిలియన్ల భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించింది. ఇది ఆయా రంగాల్లో వచ్చిన మార్పులకు సూచనగా నిపుణులు చెబుతున్నారు. ఇది మార్కెట్ (Market)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని అభిప్రాయ పడుతున్నారు.
తగ్గిన ఉద్యోగుల సంఖ్య..
అంతే కాకుండా సీఎమ్ఐఈ సర్వే ప్రకారం నెలవారీ ఉపాధి డేటా కూడా ఆధారంగా ఉద్యోగాలు తగ్గాయి. సెప్టెంబర్లో ఉద్యోగుల సంఖ్య 406.24 మిలియన్లు ఉండగా.. అదే అక్టోబర్ వచ్చే నాటికి ఉద్యోగుల సంక్య బాగా తగ్గి 400.77 మిలియన్లకు చేరింది. అంతే కాకుండా దేశంలో శ్రామికుల భాగస్వామ్య రేటు కూడా తగ్గింది.
సెప్టెంబర్లో దేశంలో జాతీయ శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పిఆర్) సెప్టెంబర్లో 40.66 శాతం ఉండగా అది అక్టోబర్లో 40.41 శాతానికి దిగజారింది. అయితే ఆగస్టులో ఎల్ఎఫ్పిఆర్ 40.52 శాతంగా ఉంది.
పెరిగిన గ్రామీణ పేదరికం..
సర్వేలో అక్టోబర్ నెలలో దేశంలో 712,000 మందికి పైగా ఉపాధి పొందరని వెళ్లడైంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఉపాధిని కోల్పోయినట్టు CMIE డేటా వెల్లడించింది. ఇది ఆందోళనకరమని పలు వర్గాల మేధావులు పేర్కొంటున్నారు. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు సరిపడ స్థాయిలో ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల తగ్గుదల సరికాదని అంటున్నారు.
పరిశ్రమలు, పలు రంగాల్లో సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబర్లో దాదాపు 7 మిలియన్ల మందిని తొలగించాయి. ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగం ఉపాధి తగ్గుదల ఉంది. కానీ సేవారంగంలో ఉపాధి అవకాశాల కారణంగా పరిస్థితి అదుపు తప్పలేదు.
కోవిడ్ తరువాత జాబ్ మార్కెట్ మిశ్రమ సంకేతాలను ఇస్తోందని నిపుణులు మరియు ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. అయితే పట్టణ జాబ్ మార్కెట్ కోలుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలు వెనుకబడ్డాయని సర్వేలో వెల్లడైంది.
అయితే మెరుగైన జీఎస్టీ వసూళ్లు, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వినియోగ చక్రం, సాంకేతికత మరియు విద్యారంగంలో అధిక డిమాండ్ కాస్త సానుకూల అంశాలుగా ఉన్నాయని XLRI, జంషెడ్పూర్లో ప్రొఫెసర్ కె.ఆర్. శ్యామ్ సుందర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సేవారంగా కీలకం అన్నారు. 2022కు ఈ రంగం మార్కెట్ పునరుద్ధరణకు దోహదం చేస్తుందని అభిప్రాయ పడ్డారు.
పెరిగిన నిరుద్యోగ రేటు..
CMIE డేటా సెప్టెంబర్లో 149.22 మిలియన్ల నుంచి అక్టోబర్లో సేవా రంగ ఉపాధి 154.6 మిలియన్లకు పెరిగింది. ఇతర రంగాల్లో మాత్రం ఉద్యోగుల కోత ఉన్నట్టు స్పష్టమవుతుంది. అంతే కాకుండా CMIE సర్వేలో జాతీయ నిరుద్యోగిత రేటు సెప్టెంబరులో 6.86% ఉండగా అక్టోబర్లో 7.75%గా వెల్లడైంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఉద్యోగ కల్పన అనేది ఒక సమస్యాత్మకంగా మారింది. కరోనా తరువాత ఈ సమస్య మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.