తమిళనాడు సీఎంగా స్టాలిన్ ఎంపికైన తర్వాత అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పాలనలో కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలోనే తాజాగా ఆయన మానవతను చాటారు. అనుకోకుండే వచ్చే ప్రమదాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఓ స్కీంను తీసుకువచ్చారు.
తమిళనాడులోని ప్రయాణికులు, వాహనదారులు ఎవరైనా ప్రమాదానికి గురైతే... వారికి రెండు రోజుల పాటు ఉచిత చికిత్స అందించే ఏర్పాటును చేశారు. అంటే ప్రమాదానికి గురైన వ్యక్తి స్థానికంగా ఉండే ఏ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఆసుపత్రిలో చేరిన తర్వాత 48 గంటల పాటు ఉచితంగా చికిత్స అందించనున్నారు. ఇందుకోసం ప్రతి వ్యక్తికి అత్యవసరం కింద లక్ష రూపాయల వరకు ఖర్చు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు.
అయితే ఈ స్కీం ఇతర రాష్ట్రాల వారికి కూడా వర్తిస్తుందని చెప్పారు. అంటే ఇతర రాష్ట్రాల వారు ఒకవేళ ఆ రాష్ట్రంలో ప్రమాదానికి గురైనా ఈ స్కీం వర్తించనుంది. ఇక ఇందుకోసం మొదటి దశలో 50 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారు. అయితే ప్రస్తుతమే కొనసాగకుండా నిరంతరం కొనసాగే విధంగా చట్టం కూడా తేనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా దీని ద్వారా ఇతర రాష్ట్రాల నుండి వెళ్లిన వారితో పాటు రాష్ట్రంలోని ఆయా ప్రాంతల నుండి ప్రయాణిస్తున్న వారికి లబ్ధి చేకూరనుంది. దీంతో ఒకవేళ ప్రమాదాలు జరిగప్పుడు చేతిలో సమయానికి డబ్బులు లేకున్నా ప్రాణాలు నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇది చదవండి : మాజీ కలెక్టర్‌కు మరో షాక్.. ఆయన నామినేషన్ రద్దుపై పిల్
కాగా గతంలో కూడా పరిపాలన పరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు .. వాటిలో ముఖ్యంగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తగ్గించుకోవడంతో పాటు భారీ కాన్వాయ్‌ని తగ్గించుకున్నారు. మరోవైపు సీఎం వెళుతున్నప్పుడు సిగ్నల్ ఫ్రీ లేకుండా చర్యలు చేపట్టాడు. అంటే ఆయన కూడా ఒక సాధారణ ప్రజల వలే ట్రాఫిక్‌లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు గిఫ్టులు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడడంతో పాటు సమావేశాలు జరుగుతున్న సమయంలో తనను అనవసరంగా ఆకాశానికి ఎత్తె వారిని కూడా సున్నితంగా మందలించారు. ఇలా సాధారణ పౌరుల వలే ప్రయాణించడం నుండి పోలీసుస్టేషన్‌కు వెళ్లి తనిఖీలు చేపట్టడడం లాంటీ చర్యలు ఆయన మీద క్రేజ్‌ను మరింత పెంచాయి. దీంతో స్టాలిన్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో కూడా అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది చదవండి : లిక్కర్ టెండర్లలోనే కిక్కు.. అప్లికేషన్స్‌తోనే వందల కోట్లు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.