• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CM NARAYANA SWAMY SUITS CORRUPTION ALLEGATION AGAINST PUDUCHERRY LT GOVERNOR KIRAN BEDI KIRAN BEDI

కిరణ్ బేడిపై పుదుచ్చేరి సీఎం అవినీతి ఆరోపణలు

కిరణ్ బేడిపై పుదుచ్చేరి సీఎం అవినీతి ఆరోపణలు

పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ(ఫైల్ ఫోటో)

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిపై స్వయంగా ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి అవినీతి ఆరోపణలు చేయడం పుదుచ్చేరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • Share this:
    పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. సీఎస్ఆర్ పథకంలో కిరణ్ బేడి రూ.85 లక్షలు స్వాహా చేశారని ఆరోపణలు గుప్పించారు. కిరణ్ బేడికి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి మధ్య పలు అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలోనూ వారిద్దరూ పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ బేడిపై నారాయణ స్వామి అవినీతి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

    పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి(ఫైల్ ఫోటో)
    పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి(ఫైల్ ఫోటో)


    రాజ్ భవన్‌ను చూపించి సీఎస్ఆర్ పథకం కింద కిరణ్ బేడి రూ.85 లక్షలు వసూలు చేశారని నారాయణ స్వామి ఆరోపించారు. ఈ వ్యవహారంలో కిరణ్ బేడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం పుదుచ్చేరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Janardhan V
    First published: