హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

West Bengal :మరో వివాదం... వ్యాక్సిన్ సర్టిఫికేట్ పై మోడికి బదులుగా మమతా ఫోటో

West Bengal :మరో వివాదం... వ్యాక్సిన్ సర్టిఫికేట్ పై మోడికి బదులుగా మమతా ఫోటో

ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

West Bengal : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదానికి తెర లేపారు..కోవిడ్ టీకా సుకున్న తర్వాత ఇచ్చే సర్టిఫికేట్‌పై ప్రధాని మోడి ఫోటోను తొలగించి ఆ స్థానంలో సీఎం మమతా బెనర్జీ ఫోటోలను ముద్రిస్తున్నారు.

ఇంకా చదవండి ...

పశ్చిమ బెంగాల్‌లో మమతా గెలుపు తర్వాత నువ్వా నేనా..అన్నట్టు తయారైంది...ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే తాజాగా మమతా బెనర్జీ మరో వివాదానికి తెరలేపింది. ప్రధాని మోడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇచ్చే సర్టిఫికెట్స్‌పై ప్రధాని మోడి ఫోటోలను ముద్రిస్తున్నారు. అయితే ఈ ఫోటోలపై కొంత వివాదం చెలరేగింది..పలు రాష్ట్రాలు ఈ విషయంపై విమర్శలు కూడా చెలరేగాయి..అయినా..వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై మోడి ఫోటోలు కొనసాగుతున్నాయి.

అయితే మోడి నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.. మమతా బెనర్జీ మరో వివాదానికి తెర లేపింది.. ప్రస్తుతం బెంగాల్‌లో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. 18 నుండి 44 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి ఇచ్చే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్‌పై ప్రధాని మోడి ఫోటోలను తొలగించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోటోలను ముద్రించారు. అయితే ఫోటోలు ఎందుకు మార్చారో ఆ పార్టీ నేతలు వివరించారు..ప్రస్తుతం ఇస్తున్న వ్యాక్సిన్ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఇస్తున్నందున ప్రధాని ఫోటోలకు బదులు సీఎం ఫోటోలను పెట్టినట్టు తెలిపారు.

అయితే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోడీ ఫోటో ఉండగా ఇప్పుడు మమతా బెనర్జీ ఆయన స్థానంలో తన ఫోటోను ముద్రించుకోవడం మరో వివాదంగా మారనుంది..దీంతో ఇరు ప్రభుత్వాల మధ్య మరిన్ని విమర్శలకు వ్యాక్సిన్ కారణం కానుంది. అయితే మమతా ఫోటో ముద్రణపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నేతలు సైతం ఎలాంటీ కామెంట్స్ చేయలేదు.. వ్యాక్సిన్ కొరతతో ఆయా రాష్ట్రాలు ప్రైవేటు ప్రోక్యుర్‌మెంట్‌కు వెళ్లాయి.. దీంతో ఇతర కంపనీల వ్యాక్సిలన్‌లను ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు కొనుగోలు చేసి ప్రజలకు ఇప్పించినట్టైతే అక్కడ కూడా సీఎం మమతా బెనర్జీ ఇతర రాష్ట్రాల సీఎంలు ఫాలో అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి..మరి దీనిపై మోడి ప్రభుత్వం ఎలాంటీ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Published by:yveerash yveerash
First published:

Tags: Corona Vaccine, Mamata Banarjee, Pm modi, West Bengal

ఉత్తమ కథలు