ఇంటర్నెట్ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ...జనాలపై సీఎం వరాల జల్లు

ఢిల్లీవాసులకు ప్రతి నెలా 15 జీబీ డేటాను అందిస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

news18-telugu
Updated: August 8, 2019, 6:32 PM IST
ఇంటర్నెట్ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ...జనాలపై సీఎం వరాల జల్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ ప్రజలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు కురిపిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆఫర్లు ప్రకటించిన సీఎం తాజాగా మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చారు. ఢిల్లీలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీవాసులకు ప్రతి నెలా 15 జీబీ డేటాను అందిస్తామని తెలిపారు. అందుకోసం నగర వ్యాప్తంగా 11 వేల హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మరో 4 నాలుగు నెలల్లో ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు కేజ్రీవాల్.

First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading