Home /News /national /

Power crisis: పంజాబ్​లోనూ విద్యుత్ సంక్షోభం.. ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి సీఎం విజ్ఞప్తి.. ఇప్పటికే కేంద్రానికి ఏపీ సీఎం లేఖ

Power crisis: పంజాబ్​లోనూ విద్యుత్ సంక్షోభం.. ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి సీఎం విజ్ఞప్తి.. ఇప్పటికే కేంద్రానికి ఏపీ సీఎం లేఖ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై మిగతా ముఖ్యమంత్రులు మౌనం వహించినా, ఏపీ సీఎం జగన్ (CM jagan) మాత్రం కేంద్రానికి లేఖాస్త్రాన్ని సంధించారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి విద్యుత్ సంక్షోభంపై జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు.. కాగా, ఈ జాబితాలో ఇపుడు పంజాబ్​ సీఎం (Punjab cm) చరణ్ జీత్​ ​సింగ్​ చన్నీ చేరారు.

ఇంకా చదవండి ...
భారత్ లో విద్యుత్ సంక్షోభ (Power crisis) పరిస్థితులు నెలకొన్నాయి. మన దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటులో 70శాతం బొగ్గు ఆధారితమని తెలిసిందే. దేశవ్యాప్తంగా 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు (power plants) ఉండగా వాటిలో సగానికి పైగా ప్లాంట్లలో బొగ్గు నిల్వలు (coal storage) దాదాపు అడుగంటి పోయాయి. అక్టోబర్ లోనూ వర్షాలు (rains) దంచికొతుండటంతో బొగ్గు (coal) ఉత్పత్తికి అదనపు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ దశలో రాష్ట్రాల పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా తయారైంది. బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై మిగతా ముఖ్యమంత్రులు మౌనం వహించినా, ఏపీ సీఎం జగన్ (CM jagan) మాత్రం కేంద్రానికి లేఖాస్త్రాన్ని సంధించారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి విద్యుత్ సంక్షోభం (power crisis)పై జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు.. కాగా, ఈ జాబితాలో ఇపుడు పంజాబ్​ సీఎం (Punjab cm) చరణ్ జీత్​ ​సింగ్​ చన్నీ చేరారు. పంజాబ్​లో బొగ్గు కొరత ఉందని పరిష్కరించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తి నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

విద్యుత్​ కోతలు..

పంజాబ్‌ (Punjab)లోని బొగ్గు నిల్వలు కొన్ని రోజుల్లో అయిపోతాయని ముఖ్యమంత్రి చన్నీ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని చన్నీ సమీక్షించారు. థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు లేని కారణంగా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు . నగరాలు, గ్రామాల్లో గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, వ్యవసాయ రంగానికి కోతలు విధించాల్సి వస్తుందన్నారు సీఎం చరణ్​జీత్​ సింగ్.

పశ్చాత్తాప పడాలి :  సిద్దూ

కాంగ్రెస్ పార్టీ నేత చెందిన నవజ్యోత్ సింగ్ సిద్దూ (navjoth singh sidhu) .. 30 రోజుల వరకు బొగ్గు నిల్వలు ఉంచకుండా దేశీయ వినియోగదారులను శిక్షిస్తున్నారని ప్రభుత్వం (government) పశ్చాత్తాపం పడలన్నారు. సోలార్ పీపీఎలు, రూఫ్-టాప్ సోలార్‌పై దూకుడుగా పని చేయాల్సిన సమయం వచ్చిందని అని అన్నారు.

పంజాబ్‌ రాష్ట్రంలో 5,620 మెగావాట్ల (MW) ఉత్పత్తి సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు (thermal power plants) ఉన్నా ప్రస్తుతం 2,800 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు కొరత ఫలితంగా పంజాబ్‌లోని లెహ్రా మొహబ్బత్, రోపర్ (రూప్‌నగర్), రాజ్‌పురా, తల్వాండి సాబో, గోయింద్వాల్ సాహిబ్‌తో సహా థర్మల్ పవర్ ప్లాంట్లు మరో నాలుగు రోజులు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయగలవని చెప్పారు. పంజాబ్‎లో ఇప్పటికే ఐదు థర్మల్ పవర్ ప్లాంట్‌లు మూసివేశారు. బొగ్గు కొరత కారణంగా రోపర్‌లో రెండు, తల్వంతి సాబోలో రెండు, లెహ్రా మొహబ్బత్‌లో ఒకటి మూసివేశారు (closed).

ఉత్పత్తి తగ్గటంతో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) ప్రైవేట్ సంస్థలు, పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని పీఎస్‌పీసీఎల్ ఛైర్మన్ ఎ వేణు ప్రసాద్ తెలిపారు. బొగ్గు కొరత కారణంగా పీఎస్‌పీసీఎల్ మూడు నుండి ఆరు గంటల వరకు విద్యుత్ కోతలను విధిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Politics, Power problems, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు