ఉత్తర భారతంలో వర్షాలు దండికొండుతున్నాయి. రుతుపవనాల కారణంగా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో కుండపోత వర్షం కురిసింది. ధర్మశాల, ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ధర్మశాలలోని భగ్సు నాగ్ ప్రాంతంలో వరదల్లో కార్లు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆకస్మిక వరదల కారణంగా వాహనాలతో పాటుగా, ఆ ప్రాంతంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
ఖరీదైన వాహనాలు వరదల్లో కొట్టుకుపోతుంటే.. స్థానికులు ఏం చేయలేక చూస్తుండిపోయారు. ఎందుకంటే అక్కడ వరద ప్రవాహం భారీగా ఉంది. ఈ పరిస్థితులు నేపథ్యంలో ఆ ప్రాంతంలోని స్థానికులతో పాటు, పర్యాటకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
आज हिमाचल प्रदेशातील धर्मशाला याठिकाणी मान्सूननं रौद्ररूप धारण केलं आहे. ढगफुटी (cloudburst) झाल्यानं धर्मशाला येथील भागसू याठिकाणी मोठ्या प्रमाणात पाणी शिरलं आहे. pic.twitter.com/JawvWiWbLH
— The मराठी Medium (@MarathiMedium) July 12, 2021
భారీ వర్షాల కారణంగా.. హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన పలువురు ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. మరికొద్ది రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగే పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నదులలో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాలో పర్యాటకులు సంచరించవద్దని కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Himachal Pradesh, Viral Video