corona : కరోనా మృతుల బట్టలు కూడ వదలని నీచులు ..!

ప్రతీకాత్మక చిత్రం

corona : కరోనా కాలంలో అనేక దారుణాలు వెలుగు చూస్తున్నాయి. కరోనాతో మృతి చెందిన వారి శరీరలపై ఉన్న బంగారం మాయం చేయడంతోపాటు , శవాలపై ఉన్న బట్టలను కూడ వదలడం లేదు.

  • Share this:
కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే..కొంతమంది మాత్రం డబ్బు సంపాదనకు తెరతీశారు. మనిషి చచ్చిపోతున్నా కనీస కరుణ చూపకుండా కొన్నిముఠాలు వ్యవహరిస్తూ..బతికున్నప్పుడే పీక్కుతింటున్నారు. మనిషి బతికి ఉన్నప్పుడు సరే కొన్ని చోట్ల కరోనాతో చచ్చిపోయిన శవాలను కూడ వదలడం లేదు. శవాలపై ఉన్న బంగారమే కాదు వారు వేసుకున్న బట్టలు కూడ మాయం చేస్తున్న దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

కరోనా కాలంలో మనుషులకు బాసటగా ఉండాల్సిన వారు..కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా శవాలతో కూడ వ్యాపారం చేస్తూ..నీచ వ్యవస్థకు తెర లేపారు. కరోనా మృతుల వద్దకు కనీసం కుటుంబ సభ్యులు దగ్గరికి రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటీ పరిస్థితుల్లో కొన్ని ముఠాలు తమకు అవకాశంగా మార్చుకున్నాయి. కరోనా మృతుల పై ఉన్న బంగారం ఇతర వస్తువులు దోచుకుని పోతున్నారు.

బంగారం అంటే విలువైందని భావించవచ్చు కాని యూపీలో అంతకంటే దారుణమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. యూపీలో వేల మంది కరోనా భారిన పడి మృత్యువాత పడుతున్న నేపథ్యంలోనే వారిని ఎక్కడికక్కడే దహనం చేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడి శ్మశానవాటికల్లో ఒళ్లు గుగుర్పాటుకు లోనయ్యో సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది దొంగలు శ్మశాన వాటికలకు వచ్చిన శవాలపై ఉన్న బట్టలు దొంగిలిస్తున్నారు. అనంతరం వాటిని ఉతికి మళ్లి విక్రయించడం చేస్తున్నారు.

అయితే విషయం బయటపడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మొత్తం ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.కరోనా మృతదేహాలపై కప్పిన ముసుగులతో సహా, చీరలు, కుర్తాలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులను ఈ ముఠా చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా వీరి నుంచి మొత్తం 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

అయితే వీరు స్వతహాగా ఇలాంటీ పని చేసేందుకు సహసించడం లేదు. స్థానికంగా ఉండే వ్యాపారులు ఇలాంటి వారితో డీల్‌ కుదుర్చుకుని, వారికి రోజుకు రూ.300 చొప్పున చెల్లించి ఇలాంటి పనులు చేయిస్తున్నట్లు కూడా పోలీసుల దృష్టికి రావడంతో వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు..కాగా అరెస్టయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published by:yveerash yveerash
First published: