హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అరటితో వస్త్రాలు, ఔషదాలు తయారీ.. పరిశోధన ప్రాజెక్టుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి

అరటితో వస్త్రాలు, ఔషదాలు తయారీ.. పరిశోధన ప్రాజెక్టుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి

అరటి పండు.. సామాన్యులకు కూడా దొరికే అతి చౌకైన ఫలం. అంతేకాకుండా రెగ్యూలర్ గా ఆహారంలో అరటిని భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

    అరటి పండు.. సామాన్యులకు కూడా దొరికే అతి చౌకైన ఫలం. అంతేకాకుండా రెగ్యూలర్ గా ఆహారంలో అరటిని భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పీచుపదార్ధాలు, ఐరన్ లాంటి ఖనిజాలు శరీరానికి పుష్కలంగా దొరిగి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే అరటిపండును వేరే రకంగా కూడా వాడనున్నారు. వస్త్రాలు, ఔషధాల(Medicine). ఈ దిశగా తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అరటి ఫైబర్(పీచు), కాండం నుంచి వస్త్రాలు, ఔషధాలను తయారు చేయనున్నారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం 400 కోట్ల రూపాయల పరిశోధన ప్రాజెక్టును ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. జిల్లాలోని ప్రధాన అరటి సాగు ప్రాంతమైన మెట్టుపాలయంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ధోతీలు, చొక్కాలు తయారు చేయడంలో అరటి ఫైబర్ ఉపయోగం, ఔషధాల తయారీలో కాండం ప్రత్యేకత గురించి ఇస్రో డైరెక్టర్ మయిల్సామి అన్నాదురై వివరించారు.

    ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అరటిని సాగుచేసే వారి ఆదాయం రెట్టింపు అవుతుందని పళనిస్వామి అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ ఆఖరులో లేదా మే ప్రారంభంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 6.26 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే పురుషుల కంటే మహిళల ఓటర్ల 10 లక్షలు ఎక్కువగా ఉండటం గమనార్హం. తమిళనాడులో మొత్తం 6,26,74,446 కోట్ల ఓటర్లు ఉన్నారు. మహిళలు 3,18,28,727 కోట్ల మంది ఉండగా, పురుషులు 3,08,38,473 మంది ఉన్నారు. ఇతరులు 7,246 మంది ఉన్నారు.

    First published:

    Tags: National News, Tamil nadu

    ఉత్తమ కథలు