జమ్ము కశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్‌గా(Constable) పని చేస్తున్న తౌసీఫ్ అహ్మద్ మీర్ అనే వ్యక్తి ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉల్-ముజాహిదీన్‌తో కలిసి పని చేస్తున్నాడని.. అతని సహోద్యోగులు అయిన ఇద్దరు పోలీసులను కూడా చంపడానికి ప్రయత్నించాడని తెలిసింది. మార్చి 30వ తేదీన జమ్ము కశ్మీర్(Jammu And Kashmir) ప్రభుత్వ యంత్రాంగం తొలగించిన ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులలో తౌసీఫ్ అహ్మద్ మీర్ ఒకడు. భారత రాజ్యాంగంలోని(Indian Constitution) ఆర్టికల్ 311 (2) (సి) ప్రకారం కేసుల పరిశీలన, సిఫార్సుల కోసం జమ్ము కశ్మీర్లో (Jammu Kashmir) ఏర్పాటు చేసిన కమిటీ.. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న కారణంగా ఓవర్ గ్రౌండ్ వర్కర్(OGW)గా పనిచేసినందుకు ఐదు మంది ఉద్యోగులను ప్రభుత్వ సేవల నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
తౌసీఫ్ అహ్మద్ దార్(పోలీస్ కానిస్టేబుల్, పుల్వామా జిల్లా ): తౌసీఫ్ తండ్రి అల్-జిహాద్ సంస్థకు చెందిన ఉగ్రవాది అని, 1997లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని తెలిసింది. ఆ తర్వాత తౌసీఫ్ పోలీసు శాఖలో చేరాడు. రహస్యంగా ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు సమాచారం. హిజ్బ్ ఉల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు చెందిన పలువురు కమాండర్లతో ఇతడిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షోపియాన్ జిల్లాలో ఐదుగురు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ కూడా అందించాడు. 2017 జూన్‌లో తౌసీఫ్‌తో కలిసి తీవ్రవాద సంస్థకు చెందినవాళ్లు ఎస్పీఓను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనలో ఎస్పీవో ప్రాణాలతో బయటపడ్డాడు.
అయినప్పటికీ తౌసీఫ్ షోపియాన్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. రెండు ప్రయత్నాలూ విఫలమవడంతో తౌసీఫ్ యువతను ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేపట్టాడు. అతని కార్యకలాపాలు తెలిసినప్పుడు షోపియాన్ పోలీస్ స్టేషన్లో తౌసీఫ్‌పై ప్రజా భద్రతా చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 2017 జూలైలో సర్వీస్ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ విధుల నుంచి తొలగించలేదు. జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణిస్తూ తౌసీఫ్‌ను ప్రభుత్వ సేవల నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గులాం హసన్ పర్రే(కంప్యూటర్ ఆపరేటర్, శ్రీనగర్): గులాం హసన్ సయ్యద్ అలీ షా గిలానీ ఆశీర్వాదంతో ప్రభుత్వ ఉద్యోగంలో గులాం హసన్ పర్రే చేరినట్లు సమాచారం. జమాత్-ఎ-ఇస్లామీ (JeI)లో క్రియాశీల సభ్యుడుగా ఉన్న గులాం హసన్‌పై 2009లో పరింపోరాలో హింసాత్మక నిరసనను నిర్వహించినందుకు కేసు నమోదు అయింది. యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపించేందుకు వేర్పాటువాద గ్రూపులు గులాం హసన్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఇస్లామిక్ స్టేట్ (IS) కోసం జమ్ము కశ్మీర్లో గులాం హసన్ రహస్యంగా ప్రచారాన్ని ప్రారంభించాడు. ముగీస్ అహ్మద్ అనే యువకుడిని ఉగ్రవాద శ్రేణుల్లో చేరేలా ప్రేరేపించాడని కూడా తెలిసింది. ఆ తర్వాత ఎన్కౌంటర్లో ముగీస్ మరణించాడు. ప్రభుత్వోద్యోగి ముసుగు వేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలను గులాం హసన్ చేపడుతున్నాడు.
అర్షిద్ అహ్మద్ దాస్(ఉపాధ్యాయుడు, అవంతిపొర): ఉపాధ్యాయుడు అయినప్పటికీ.. అర్షిద్ అహ్మద్ జేఐ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. అతను ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉల్ ముజాహిదీన్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని, ఉపాధ్యాయుడి ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నాడని తెలిసింది. అవంతిపోరాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై రాళ్లు రువ్వేందుకు ఓ గుంపునకు కూడా నేతృత్వం వహించాడు. జేఐ, ఇతర ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో అర్షిద్ పాల్గొంటున్నట్లు తెలిసింది.
షాహిద్ హుస్సేన్ రరాథెర్(పోలీస్ కానిస్టేబుల్, బారాముల్లా): 2005లో షాహిద్ ఎస్పీవోగా నియమితుడయ్యాడు. 2009లో మొదటిసారిగా అతని తీవ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అతనిపై వేటు పడినా 2011లో మళ్లీ ఎస్పీవోగా నియమితుడయ్యాడు. తదనంతరం 2013లో కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నప్పుడు కశ్మీర్ లోయ అంతటా పనిచేస్తున్న ఉగ్రవాదులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రవాణా చేశాడు.
2021 జూన్‌లో షాహిద్‌తో పాటు స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న అతని ఇద్దరు సహచరులను ఉరీలో అడ్డగించి, వారి నుంచి 10 హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు చైనీస్ పిస్టల్స్ , డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్న సమయంలో షాహిద్ సంబంధాలు బహిరంగమైన విషయం తెలిసిందే. అతన్ని అరెస్టు చేసి.. తదుపరి విచారణలో మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
షరాఫత్ అలీ ఖాన్(నర్సింగ్ ఆర్డర్లీ, హెల్త్ డిపార్ట్మెంట్, కుప్వారా): షరాఫత్ ఖాన్ 1998లో ఎస్పీవోగా నియమితుడయ్యాడు. ఆ తర్వాత ఆరోగ్య శాఖలో ఉద్యోగం పొందాడు. ఆరోగ్య శాఖలో ఆయన నియామకం నేపథ్యం గురించి ఏమీ తెలియదు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ షరాఫత్ ఖాన్ వివిధ ఉగ్రవాద సంస్థల కోసం పనిచేయడం ప్రారంభించాడు. నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల (FICN) చెలామణిలో కూడా పాలుపంచుకున్నాడు. FICN కార్టెల్ అరెస్టు మరియు తదుపరి విచారణ సమయంలో షరాఫత్ పేరు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. కుప్వారా పోలీస్ స్టేషన్లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
2021 జూన్‌లో బారాముల్లాలో పోలీసు కానిస్టేబుల్ షాహిద్‌తో పాటు అరెస్టయినప్పుడు ఉగ్రవాద సంస్థలతో అతనికి ఉన్న లోతైన సంబంధాలు తెరపైకి వచ్చాయి. జ2022న మార్చి 30న ఆయనపై వేటు పడింది. దేశ భద్రత దృష్ట్యా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సి) ప్రకారం పై ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.